కేకే సర్వే (KK Survey) మళ్లీ నిజమైంది. ఏ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేయని విధంగా ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 161 సీట్లు వస్తాయని కేకే సర్వే చెప్పగా.. ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. తాజాగా మహారాష్ట్రలో 225 స్థానాల్లో మహాయుతి (mahayuti) వస్తుదని కేకే సర్వే వెల్లడించింది. మరే ఇతర సర్వే సంస్థలు కూడా కూటమి 200+ వస్తందని అంచనా వేయలేదు. ఇప్పడు కేకే సర్వేను నిజం చేస్తూ ఫలితాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే 159 స్థానాల్లో గెలిచిన ఎన్డీయే కూటమి ఇంకా 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలోనే కేకే సర్వే సక్సెస్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక్లలో బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి.. అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని విజయం దిశగా దూసుకెళ్తోంది. కూటమి అభ్యర్థులు 220కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాడీ కూటమి 55 చోట్ల ముందంజలో ఉంది. ఇతరులు 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra election 2024) కేకే సర్వే మాత్రమే 200కి పైగా స్థానాల్లో మహాయుతి కూటమి గెలుస్తుందని అంచనా వేసింది. మహాయుతికి 225 సీట్లు.. మహా వికాస్ ఆఘాడీ 56 స్థానాల్లో గెలుపొందుతుందని.. ఇతరులు మరో 7 స్థానాలను కైవసం చేసుకుంటారని కేకే సర్వే వెల్లడించింది. కేకే సర్వేకు అనుగుణంగానే ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి.
కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేకే సర్వే చెప్పినట్లుగానే ఫలితాలు వచ్చాయి. ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని కేకే సర్వే తెలిపింది. 175 నియోజకవర్గాలకు గానూ ఎన్డీఏ కూటమి 161 స్థానాల్లో గెలుస్తుందని, వైసీపీ 14 సీట్లు మాత్రమే సాధిస్తుందని సర్వేలో పేర్కొంది. సర్వేకు అనుగణంగా ఫలితాల్లో టీడీపీ కూటమికి 164 రాగా.. వైసీపీకి 11 మాత్రమే వచ్చాయి.