
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో (Erravelli Farmhouse) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండు మూడు రోజుల నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలు వివరించేందుకు కేసీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల కిందట కవిత కేసీఆర్ కు రాసిన లేఖ (Letter Politics) బయటపడగా.. దాన్ని తానే రాశానని అది ఎలా బయటకు వచ్చిందో తెలియదని కవిత మీడియా ఎదుట అన్నారు. దీంతో పాటు కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దెయ్యాలు ఎవరు?
కేసీఆర్ దేవుడని, దెయ్యాలు చుట్టూ ఉన్నాయని అనడంతో అసలు దెయ్యాలు ఎవరూ అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేసీఆర్ కు అత్యంత దగ్గరగా ఉండేది కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) కవిత మాత్రమే ఆ తర్వాత సంతోష్ రావు, వీరు కాకుండా ఎవరూ ఆయనకు దగ్గరగా ఉంటారు. అసలు కవిత ఎందుకు అనాల్సి వచ్చింది. ఎవరిని ఉద్దేశించి కవిత వ్యాఖ్యలు చేసిందనేది ఇప్పుడు తేలాల్సిన అంశం.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై చర్చ
త్వరలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవిత తెలంగాణ భవన్ కు వస్తారా రారా అనే చర్చ సాగుతోంది. కాగా కేసీఆర్ తో కేటీఆర్ ప్రత్యేక సమావేశంలో కవిత రాసిన ఉత్తరం, దాన్ని ఎవరూ లీక్ చేశారు. ఎందుకు కవిత బహిరంగంగా మాట్లాడుతోంది. కొత్త పార్టీ తెలంగాణలో కవిత తీసుకురానుందా.. తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్ 1న అమెరికాలో జరగబోయే ప్రత్యేక కార్యక్రమానికి కేటీఆర్ వెళ్లనున్న సందర్భంగా కేసీఆర్ ను కలిసి పార్టీ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. కవిత (Kavitha) విషయంలో వేచి చూసే ధోరణి అవలంభించాలా.. లేక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎలాంటి పరిణామాలు పోతాయి తదితర అంశాలు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి కొద్ది రోజుల్లో కవిత అంశం తేలిపోనుందని రాజకీయ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.