Formula E-Race Case: నేడు ఈడీ విచారణకు కేటీఆర్

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఈరోజు (జనవరి 16) ఈడీ(Enforcement Directorate) ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ-కార్ రేసు(Formula e-car race)లో కేటీఆర్‌కు హైకోర్టులో, బుధవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ క్రమంలో ఆయన ఇవాళ ED విచారణకు హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో KTR ఇప్పటికే ACB ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-కార్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు బదిలీ చేశారని కేటీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 7న ED నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. దీంతో ఆయన ఉదయం 10 గంటలకు HYDలోని నందినగర్‌లో గల తన నివాసం నుంచి ED కార్యాల‌యానికి బయలుదేరుతారు. ఉద‌యం గం.10.30లకు LB స్టేడియం ఎదురుగా ఉన్న ED కార్యాలయానికి చేరుకుంటారు.

విచారణ టైంలో పిటిషన్ వెనక్కి తీసుకోవడం ఏంటి?

కాగా ఫార్ములా-ఈ రేస్ కేసును లొట్టపీసు కేసు అని చెప్పి.. సుప్రీంకోర్టు(Supreme court)లో క్వాష్ పిటిషన్(Quash Petition) వేసిన కేటీఆర్.. ఆ తర్వాత ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నట్లు సమాచారం. ఈ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని KTR పదేపదే చెప్పారు. పైగా రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. మొన్నటి వరకూ అలా మాట్లాడిన ఆయన.. తీరా సుప్రీంకోర్టులో క్వాష్ వేసి తర్వాత విచారణ సమయంలో వెనక్కి తీసుకోవడం ఏంటనే చర్చ జరుగుతోంది. అంటే ఇంతకాలం ACBపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నట్లే కదా? అనే సందేహం కూడా తలెత్తుతోంది.

కాగా ఈ కేసులో ఇప్పటికే ED అధికారులు సీనియర్ IAS అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిని విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో నేటి విచారణలో కేటీఆర్‌ను ఏం ప్రశ్నించస్తారనే ఉత్కంఠగా మారింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *