టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (anil ravipudi) కాంబినేషన్లో కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. షూటింగ్ స్టార్ట్ కాకముందే డిఫరెంట్ ప్రమోషన్ తో అనిల్ రావిపూడి ఇచ్చిన కిక్ తెలుగు ఆడియన్స్ ను మైమరిచిపోయేలా చేసింది. ఏకంగా నయనతార (nayana tara), చిరంజీవితో మూవీ ప్రమోషన్స్ లా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఒక గట్టి కిక్కు ఇచ్చే ఆరంభం ఇచ్చారు అనిల్ రావిపూడి. దీంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా అని గుర్తిండిపోయేలా చేశారు.

నయనతారతోనే ప్రమోషన్స్ ఇప్పించేశాడు..
ఎన్నడూ కూడా మూవీ ప్రమోషన్ లలో ఎక్కువగా కనిపించని నయనతారతో ఏకంగా సినిమా స్టార్ట్ చేయకముందే స్టార్ స్టార్ మెగాస్టార్ అంటూ చిరంజీవి (chiran jeevi) సినిమాలో చేస్తున్నాను అంటూ ఆమెతో చెప్పించిన విధానం యూట్యూబ్ ను ఒక ఊపు ఊపేస్తోంది. చిరంజీవితో ఎంట్రీ ఇచ్చి మూవీలో టెక్నిషీయన్స్ నుంచి అందరినీ పరిచయం చేసిన కంటెంట్ నభూతో నభవిష్యత్తు. యూట్యూబ్ లో లక్షల వీవ్స్ తో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మెగాస్టార్ ను ఈ విధంగా ఇప్పటి వరకు వాడుకున్న డైరెక్టర్ లేడని కాన్సెప్ట్ సరికొత్తగా ఉందని అనిల్ రావిపూడిని కొనియాడుతున్నారు.

తాజాగా తెలిసింది ఏంటంటే..
ఈ సినిమా షూటింగ్ ఇటీవల స్టార్ట్ చేశారు. కాగా అనుకున్న టైం కంటే ఒక రోజు ముందుగానే సీన్స్ అన్ని కంప్లీట్ చేసి ఫ్యాకప్ చెప్పారని టాక్. డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పీడ్ చూస్తుంటే సినిమా సంక్రాంతి కంటే ముందుగానే వచ్చేస్తుందా అన్నంతా స్పీడ్ లో వర్క్ చేస్తున్నాడని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇక రెండో షెడ్యూల్‌కి కూడా ఇప్పటికే ప్లాన్ రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక రాబోయే సంక్రాంతి (sankranthi) కి మెగాస్టార్ హిట్టు కొట్టుడు ఖాయం అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.






