గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబోలో రానున్న లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. పొలిటికల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ పొంగల్ కానుకగా ఈ నెల 10న రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో చెర్రీ సరసన కియారా అద్వానీ(Kiara Advani)నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ అంజలీ(Anjali) కీలక పాత్ర పోషిస్తోంది. దిల్ రాజు(Dil Raju) ప్రొడ్యూస్తుండగా.. తమన్(Thaman) మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ మూవీలోని మూవీ ట్రైలర్(Trailer) రిలీజ్‌పై మేకర్స్ ఓ ట్వీట్ చేశారు.
అప్పన్న పాత్ర నుంచి సాలిడ్ పోస్టర్
గేమ్ ఛేంజర్‌లో చెర్రీ పోషించిన అప్పన్న పాత్ర నుంచి సాలిడ్ పోస్టర్‌తో ఈ ట్రైలర్‌ని రేపు (Jan 2న) సాయంత్రం 5.04 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ‘ఆట మొదలైంది’ అంటూ చరణ్ పంచె కట్టుతో ఉన్న ఫొటోను పంచుకుంది. ఇక ట్రైలర్(Trailer)లో చరణ్ పాత్రల లుక్స్, ఎమోషన్స్, శంకర్ మార్క్ యాక్షన్ హైలెట్‌గా నిలవనుందని సినీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో చెర్రీ IAS ఆఫీసర్‌గా, రాజకీయ నాయకునిగా కనిపిస్తాడని అందరికీ తెలిసిందే. కానీ వీటితో పాటుగా చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్(Police Officer)గా కూడా కొంతసేపు కనిపిస్తాడని ఇటీవల దిల్ రాజు చెప్పిన విషయం తెలిసిందే. రేపటి ట్రైలర్లో చరణ్ నయా లుక్‌ని కూడా రివీల్ చేస్తారని తెలుస్తోంది.
A blockbuster start to the year already! #GameChangerTrailer drops on 2.01.2025!❤️🔥😎
Let The Games Begin 💥❤️🔥#GameChanger #GameChangerOnJanuary10 pic.twitter.com/jvJeemY9Dd
— Game Changer (@GameChangerOffl) January 1, 2025






