Mana Enadu: తెలంగాణలో ప్రస్తుతం జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం(Janwada Farm House Issue) కలకలం రేపుతోంది. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బావమరిది రాజ్ పాకాల(Raj Pakala) ఇంట్లో పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేశారు. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారని.. అంతేకాకుండా విదేశీ మద్యం(Foreign Liquor)కి సంబంధించి ఎలాంటి బిల్లులు(Bills) లేకపోవడంతో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఈ న్యూస్ రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఈనేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘ఒకరిద్దరు కలిసి మద్యం తాగితే ఒకే.. కానీ ఎక్కువ మంది కలిసి తాగేటట్లు అయితే ఎక్సైజ్ శాఖ అనుమతి(Permission of Excise Department) తీసుకోవాలి. రాజ్ పాకాల ఇంట్లో మద్యం తాగడానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అందువల్లనే వారిపై కేసులు పెట్టారు’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేఖ
దీంతో కొందరు మందుబాబులు మంత్రి పొన్నంకు లేఖ(Letter) రాశారు. దీంతో అది సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. ఇంతకీ లేఖలో ఏముందంటే.. ‘మంత్రి పొన్నం గారు నేను, నా స్నేహితులం కలిసి ప్రతి ఆదివారం మద్యం సేవిస్తాం. అయితే ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే.. దానికి ఓ బలమైన కారణం ఉంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్నేహితులం కలిసి పార్టీ చేసుకుందాం అంటే భయం వేస్తుంది. పక్కాగా అనుమతి తీసుకోవాలని మీరు సూచించడం మాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి, మా యందు దయతలచి ఎక్కడ అనుమతి తీసుకోవాలో చెప్పండి. సీఎం దగ్గరా? లేదా మీ వద్దనా? లేదా ఎక్సైజ్ శాఖ వద్దనా? ఏదో ఒక క్లారిటీ ఇస్తే మా స్నేహితులందరం కలిసి అనుమతి తీసుకుని పార్టీ చేసుకుంటామని కోరుతున్నాం. ఇట్లు మీ తెలంగాణ వాసి’ అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్(Viral) అవుతోంది.