LIC Bima Sakhi Yojana: మహిళలకు స్టైఫండ్.. ఈ పథకం గురించి తెలుసా?

మహిళలకు సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) కీలక చర్యలు తీసుకుంటోంది. అందుకోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Life Insurance Corporation of India)తో కలిసి ఓ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. కొద్ది రోజుల క్రితమే గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్(
Golden Jubilee Scholarship Scheme) తీసుకొచ్చిన LIC ఇప్పుడు ‘బీమా సఖి యోజన(LIC Bima Sakhi Yojana)’ పేరిట సరికొత్త స్కీమ్‌ను లాంచ్ చేసింది. ఈ పథకం ద్వారా వచ్చే 12 నెలల్లో లక్ష మందిని బీమా ఏజెంట్లుగా నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో నియమితులైన మహిళల(Womens)ను బీమా సఖి(Bima Sakhi)గా పిలుస్తారు. వారికి స్టైఫండ్(Stipend) కూడా ఇస్తారు. అందుకోసం రూ.840 కోట్ల వరకు వెచ్చించనున్నారు.

స్కీమ్ వివరాలు

బీమా సఖిగా నియమితులైన మహిళలకు బీమా రంగంలో మూడేళ్లపాటు శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్‌లో తొలి ఏడాది ప్రతి నెల రూ.7 వేలు స్టైఫండ్ ఇస్తారు. రెండో సంవత్సరంలో ప్రతి నెల రూ.6 వేల చొప్పున, మూడో ఏడాదిలో ప్రతి నెల రూ.5 వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తారు.

అర్హతలు
✦ కనీసం 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
✦ వయస్సు 18 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉండాలి.
✦ ఇప్పటికే LIC ఏజెంట్ లేదా ఉద్యోగిగా ఉన్నవారు, వారి కుటుంబసభ్యులు ఈ పథకం కోసం అప్లై చేసుకోవడానికి వీల్లేదు.
✦ LICలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందినవారు కూడా ఈ పథకానికి అనర్హులు.

దరఖాస్తు ప్రక్రియ
☛ ఈ పథకం కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా LIC అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
☛ అందులో బీమా సఖికి సంబంధించి ఓ కార్డు కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్న ‘Click Here To Apply’ పైన క్లిక్ చేయాలి.
☛ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ID, చిరునామా వంటి వివరాలను ఎంటర్ చేయాలి.
☛ మీరు LIC ఉద్యోగి/ఏజెంట్ కుటుంబసభ్యులు అయితే ఆ సమాచారాన్ని అందించండి.
☛ చివరగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే దరఖాస్తు పూర్తవుతుంది.

వెబ్‌సైట్: https://licindia.in/lic-s-bima-sakhi

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *