Hanuman Jayanthi: హనుమాన్ జయంతి.. రేపు మద్యం దుకాణాలు బంద్

శ్రీరామ దూత అయిన హనుమాన్ జయంతి(Hanuman Jayanthi)ని రేపు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఏటా చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని నిర్వస్తుంటారు. ఈ పవిత్రమైన రోజున హిందువులు(Hindus), హనుమాన్ భక్తులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ అంజన్నను పూజించి ప్రత్యేకమైన ఉపవాసాలు ఉంటారు. హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) పఠించడంతో పాటు శ్రీ రామనామ జపం చేస్తారు. ఇక హనుమాన్ జయంతిని ప్రతి సంవత్సరం హైదరాబాద్‌(Hyderabda)లో చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక ఏడాది కూడా భాగ్యనగరంలో అంజన్న శోభాయాత్ర(Hanuman Shobhayatra)కు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

Hanuman Jayanti: Fewer processions in West Bengal after Ram Navami violence, restrictions in Kolkata

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు(Wine Shops) మూసివేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు బార్లు, కల్లు దుకాణాలు కూడా పూర్తిగా మూసివేయాలని పోలీసులు స్పష్టం చేశారు. పోలీస్ శాఖ జారీ చేసిన ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్(CP) హెచ్చరించారు.

Hanuman Jayanti Shobha Yatra 2022 Hyderabad | Full Crowd at Hanuman Jayanti Rally 2022 | Telangana - YouTube

ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

ఇక హనుమాన్ జయంతి సందర్భంగా పోలీసులు రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions) విధించారు. హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమయ్యే గౌలిగూడ ‘రామ్ మందిర్(Gauliguda Ram Mandir)’ నుంచి పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామ్‌కోఠి క్రాస్ రోడ్స్, కాచిగూడ X రోడ్స్, నారాయణగూడ YMCA, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, RTC X రోడ్స్, అశోక్ నగర్, గాంధీ నగర్ బ్యాక్ సైడ్ వైశ్రాయ్ హోటల్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, CGO టవర్స్, బన్సీలాల్‌పేట రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయినీ మహంకాళి టెంపుల్, ఓల్డ్ రామ్‌గోపాల్‌పేట రోడ్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, CTO జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపిరీయల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ మీదుగా తాడ్‌బండ్‌లోని హనుమాన్ మందిర్ వరకు కొనసాగే ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఆయా రూట్లలో పోలీసులతో భారీ బందోబస్త్(Heavy deployment) ఏర్పాటు చేయనున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *