ManaEnadu: మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal), మంజు వారియర్ (Manju Warrier), వివేక్ ఒబెరాయ్ (Vivek Oberai), టోవినో థామస్(Tovino Thomas), ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం లుసిఫర్ (Lucifer). ఈ సినిమాకు మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 కేరళలో బిగ్గెస్టు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే సినిమాను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గాడ్ ఫాదర్ (God Father) పేరుతో తెలుగులో రీమేక్(Remake) చేశాడు.
ఆ గందరగోళానికి ఫుల్ స్టాప్
లూసీఫర్ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీపావళి సందర్భంగా సూపర్ స్టార్ మోహన్ లాల్ నుంచి రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. లూసీఫర్ రిలీజ్ డేట్ విషయంలో ఫ్యాన్స్‌లో ఉన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెడుతూ అధికారిక ప్రకటన చేసింది. ఈమేరకు లూసీఫర్ ఫ్రాంచైజీలో రాబోతున్న లూసీఫర్ 2 ను 2025, మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈసారి ఇతర భాషల్లోనూ..
కాగా లూసీఫర్ పార్ట్ 2 ను ‘ఎంపురాన్’ అనే టైటిల్ తో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి పార్ట్ తో సంబంధం లేకుండా పార్ట్ 2 ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. లూసీఫర్ 2ను మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి పార్ట్ ను కేవలం మలయాళంలో మాత్రమే విడుదల చేసి ఇతర భాషల్లో రీమేక్ చేశారు. అయితే మలయాళంలో ఆడినంతగా రీమేక్ చిత్రం ఆడలేదు.
Lalettan’s #L2 #Empuraan | March 27 Release.#MohanLal #PrithvirajSukumaran pic.twitter.com/vh3n7WSlkM
— Cinema Generation (@gencinemaOff) November 1, 2024






