‘దేవర'(Devara)తో సూపర్ హిట్ కొట్టిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. అయితే ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా కేజీయఫ్, సలార్ (Salar) వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్31 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి గతంలోనే అధికారిక ప్రకటన విడుదల చేశారు. కానీ అప్పట్నుంచి ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్స్ ఏం రాలేదు.
“The only soil that is worth remembering is the one soaked in blood” 🔥🔥💉💉#Dragon🐉#NTRNeel #NTR31 pic.twitter.com/tUneg3NFR2
— 𝐆.𝐎.𝐀.𝐓 (@AllHail_TheNTR) January 16, 2025
ఎన్టీఆర్-నీల్ మూవీ అప్డేట్
అయితే తాజాగా ఎన్టీఆర్, నీల్ సినిమా గురించి ఓ అప్డేట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే సలార్ సినిమాతో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ని తెలుగు తెరపైకి తీసుకొచ్చిన ప్రశాంత్ నీల్ (Prashant Neel).. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీతో మరో మాలీవుడ్ నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనుకుంటున్నాడట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే..?
#TovinoThomas to be part of #PrashanthNeel ‘s pan-India film with #NTR! pic.twitter.com/dvyyRsHM9S
— Sreedhar Pillai (@sri50) February 5, 2025
ఎన్టీఆర్ మూవీలో సూపర్ హీరో
మిన్నల్ మురళి, 2018, ఎఆర్ఎమ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు మాలీవుడ్ నటుడు టొవినో థామస్ (Tovino Thomas). ఇప్పుడు ఎన్టీఆర్ (NTR) సినిమాతో టొవినో థామస్ డైరెక్టుగా తెలుగు సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న NTR31 చిత్రంలో ఈ స్టార్ నటుడు ఓ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో మాత్రం తెలియదు. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఫొటో వైరల్
ప్రశాంత్ నీల్, టొవినో థామస్ లు కలిసి దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా కోసమే నీల్ టొవినో థామస్ ను కలిశాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమా సంగతికి వస్తే మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణీ వసంత్ (Rukmini Vasant) నటిస్తోంది. పీరియాడిక్ కథతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.






