Mana Enadu : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దేశానికి మన్మోహన్ చేసిన సేవలను స్మరించుకుంటూ కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చీఫ్ గా పనిచేసిన అరుణ్ అసీమ్ మన్మోహన్ సింగ్ గురించి ఓ విషయాన్ని షేర్ చేసుకున్నారు.
నా సొంత కారు మారుతీ 800
మన్మోహన్ సింగ్ కు మారుతీ 800 కారంటే అమితమైన ఇష్టమని ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్ అసీమ్ (IPS Arun Asim) తెలిపారు. ఆయన చాలా సింపుల్గా ఉండేవారని.. ఆయనకు ఒకే ఒక్క సొంత కారు ఉండేదని.. అదే మారుతీ 800 (Maruti 800 Car) కారు అని చెప్పారు. ప్రధాని ఇంటి వద్ద .. బీఎండబ్ల్యూ బుల్లెట్ ప్రూఫ్ కారుకు సమీపంలోనే ఆ మారుతీ కారు పార్క్ చేసి ఉండేదని.. ఆయన ఎప్పుడూ అది తన సొంత కారు అని చెబుతూ ఉండేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం యూపీలోని కన్నౌజ్ సర్దార్ నుంచి అసీమ్ ఎమ్మెల్యేగా గెలిచారు.
లగ్జరీ కోసం కాదు.. సెక్యూరిటీ కోసం
మధ్యతరగతి కుటుంబానికి చెందిన మన్మోహన్ (Manmohan Favorite Car).. ఆయన తన మూలాలను ఎప్పుడూ గుర్తుంచుకునే వారని అసీమ్ చెప్పారు. సాధారణ ప్రజల గురించి మన్మోహన్ ఎప్పుడు ఆలోచించేవారని తెలిపారు. బీఎండబ్ల్యూ కారు లగ్జరీ కోసం కాదు.. సెక్యూరిటీ కోసమని తాను ప్రధానికి చెప్పే వాడినని అయితే ఆప్పుడు ఆయన ఖరీదైన కారు ప్రధానికి చెందుతుందని.. కానీ మారుతీ కారు మాత్రం తనదేనని చెప్పేవారని అరుణ్ అసీమ్ గుర్తు చేసుకున్నారు.






