పిల్లల భవిష్యత్తు గురించి ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయి పెళ్లికి కావలసిన ఖర్చులు ఎక్కువగా ఉండటంతో, ముందుగానే ఆర్థికంగా సిద్ధంగా ఉండటం చాలా అవసరం. పెళ్లిళ్ల ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఇప్పటి నుంచే స్మార్ట్‌గా ప్లాన్ చేస్తే, 21 సంవత్సరాలలో రూ. 50 లక్షలు పోగు చేయడం అసాధ్యం కాదని నిపుణులు సూచిస్తున్నారు.
పెరిగే ఖర్చులు… తగ్గిపోయే ఆదాయ మార్గాలు
ఇప్పటి పరిస్థితిని పరిశీలిస్తే, పెళ్లి ఖర్చులు భారీగా పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాగే డెకరేషన్, ఫంక్షన్ హాల్, ఫోటోగ్రఫీ, బట్టలు, బహుమతులు, ఇతర సౌకర్యాలకు అయ్యే ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. ఈ తరహా ఖర్చులను భరించడానికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు(Fixed Dipasit) (FDs) సరిపోవు.
డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలి?
FD(Fixed Dipasit)లు లేదా ఇతర పెట్టుబడులతో పోలిస్తే, మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) ద్వారా మీరు ఎక్కువ రాబడి పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టలేని వారికి ఒక ఉత్తమ ప్రత్యామ్నాయ మార్గం. ఇవి ఫండ్ మేనేజర్ల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన స్టాక్స్‌లో పెట్టుబడులు పెడతారు. దీని వల్ల కాంపౌండింగ్ బలంతో మీ పెట్టుబడి విలువ గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టినట్లయితే 50 లక్షల ఫండ్ ఎలా పొందవచ్చంటే..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయడం రెండు ప్రధాన మార్గాల్లో సాధ్యమవుతుంది. మొదటిది ప్రతినెలా చేసే పెట్టుబడి విధానం, అంటే SIP (Systematic Investment Plan). దీని ద్వారా ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు కూడా తక్కువ మొత్తాలతో, ఉదాహరణకు నెలకు 500 రూపాయల నుంచి పెట్టుబడి మొదలు పెట్టవచ్చు. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులు పొందే అవకాశం ఉంటుంది.
రెండవ మార్గం.. ఒకే సారి పెద్ద మొత్తం పెట్టుబడి చేయడం, అంటే లంప్సమ్ (Lump Sum Investment). ఉదాహరణకు, ₹1 లక్షను ఒకేసారి మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి చేసి దీర్ఘకాలం పాటు వదిలివేయడం వల్ల కాంపౌండ్ ఇంట్రెస్ట్ బలంతో ఆ మొత్తం గణనీయంగా పెరగగలదు. ఈ రెండు విధానాల్లో ఏదైనా ఎంపిక చేసుకొని మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు.
SIP: ప్రతి నెలా చిన్న పెట్టుబడి, పెద్ద ఫలితం
SIP(Systematic Investment Plan)) పద్ధతిలో ప్రతి నెలా క్రమంగా ఒక నిర్దిష్ట మొత్తం పెట్టుబడి పెడితే, మీకు ఎంత పెద్ద మొత్తంగా రాబడి వచ్చే అవకాశం ఉందో తెలుసుకోండి.
ఇప్పుడు ప్రతి నెల ఐదువేల రూపాయలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లెక్కన పెట్టుబడి పెట్టినట్లయితే 21 సంవత్సరాల్లో 12% రాబడితో ఎంత డబ్బు వస్తుందో చూదాం. ప్రతి నెల 5 వేల రూపాయల చొప్పున 21 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం రూ. 12,60,000 అవుతుంది. అయితే సంవత్సరానికి 12 శాతం రాబడితో లెక్క కట్టినట్లయితే రూ. 52,15,034 పొందే అవకాశం ఉంది. అంటే మీకు 39,55,034 మేర అదనపు లాభం పొందవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ రాబడి — గణాంకాలతో
గత 25 సంవత్సరాలలో నిఫ్టీ సూచీ సుమారు 1915% పెరిగింది. అదే సమయంలో సెన్సెక్స్ 1453% పెరిగింది. ఇది చూస్తే దీర్ఘకాలిక పెట్టుబడులకు స్టాక్ మార్కెట్ మంచి ఆదాయాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్స్‌లో అనుభవం లేకుండా కూడా సురక్షితంగా పెట్టుబడి పెట్టవచ్చు.
ముఖ్య గమనిక:
ఈ కథనం సమాచారం పంచుకోవడం కోసమే. ఇది పెట్టుబడి లేదా వ్యాపార సలహా కాదని గమనించండి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు లాభనష్టాలతో కూడినవి. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారుని సంప్రదించటం ఉత్తమం.







