
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం ‘మెగా 157′(Mega157) సినిమా షూటింగ్(Shooting) తో బిజీగా ఉన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi ) తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఉగాది సందర్భంగా ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో నయనతార(Nayantara), కేథరీన్ ట్రెసా(Ketarin Tresa) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో అనిల్ రావిపూడి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీలో సంచలనం రేపింది. దీంతో ఇప్పుడు చిరుతో కలిసి ఆయన ఏ రేంజ్ హిట్ ఇస్తాడో అని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Mussoorie Schedule Done 🥳👍🏻👌🏽
It’s going to be super fun this Sankranthi 2026 with #Mega157 🥳😍😉
All charged up to begin the next schedule soon ❤️
Megastar @KChiruTweets garu
#Nayanthara #BheemsCeciroleo @sahugarapati7 @sushkonidela #Archana @YoursSKrishna @Shine_Screens… pic.twitter.com/bTe4I7patO— Anil Ravipudi (@AnilRavipudi) June 19, 2025
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా కథ ఒక భార్యాభర్తల చుట్టూ తిరుగుతుందని, ఇందులో 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామా ఉంటుందని తెలిపారు. చిరంజీవి పాత్రలో ‘గ్యాంగ్ లీడర్’, ‘ఘరానా మొగుడు’, ‘చంటబ్బాయి’లాంటి ఫన్, మాస్ టచ్ కనిపిస్తుందని చెప్పారు. ఇప్పటివరకూ షూట్ చేసిన కొన్ని సీన్లు చూస్తేనే అభిమానులకు గూస్బంప్స్ తెచ్చేలా ఉన్నాయి” అని తెలిపారు.
అంతేకాదు, గాసిప్ల్లో ఉన్న వెంకటేష్(Venkatesh) గెస్ట్ రోల్ విషయంలో కూడా అనిల్ క్లారిటీ ఇచ్చారు. వెంకీ పాత్ర ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అని స్పష్టం చేశారు. ఆయన ఎంట్రీ రోజే థియేటర్లలో బ్లాస్ట్ అవుతుందని అన్నారు. అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’లో క్యూట్ బుడ్డోడు బుల్లి రాజు.. ఈ సినిమాలో మాత్రం పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడని వెల్లడించారు.