
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రూపొందుతున్న ‘రామాయణ (Ramayana)’ సినిమా గురించి ఇటీవల వెల్లడైన వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ రెండు భాగాల సినిమాటిక్ ఎపిక్‌ను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా (Producer Namit Malhotra) ఈ చిత్ర బడ్జెట్(Budget) గురించి మాట్లాడారు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ఇండియన్ సినీ హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిస్తున్నామన్నారు. ఈ మూవీ కోసం సుమారు $500 మిలియన్లు అంటే దాదాపు రూ.4000 కోట్లు అని ఒక పాడ్‌కాస్ట్ (Podcast)లో వెల్లడించారు. ఇది భారతదేశంలో ఇప్పటివరకు నిర్మితమైన అత్యంత ఖరీదైన చిత్రంగా నిలుస్తుంది ఆయన పేర్కొన్నారు.
🚨Namit Malhotra’s #Ramayana budget is $500M or 4000 crores, making it the most expensive Indian film ever made. pic.twitter.com/4LFMvT5L2t
— Redding Cream (@redding_cream_t) July 14, 2025
హాలీవుడ్ రేంజ్‌లో విజువల్ ఎఫెక్ట్స్
కాగా నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతగా, యశ్ (Yash) రావణుడిగా, సన్నీ డియోల్ (Sunny Deol) హనుమంతుడిగా నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ & యశ్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా హాలీవుడ్ (Hollywood) స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, హన్స్ జిమ్మర్, ఎ.ఆర్. రెహమాన్ సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించనుంది.
బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్
కాగా ఈ ప్రాజెక్ట్‌ను 2015 నుంచి రూపొందించిన నమిత్ మల్హోత్రా.. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. “ఇది డబ్బు కోసం కాదు, భారతీయ కథలను ప్రపంచ స్థాయిలో ఆవిష్కరించాలనే ఆకాంక్ష” అని ఆయన పేర్కొన్నారు. కాగా రామాయణం మొదటి భాగం 2026 దీపావళికి రానుండగా.. రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ గ్లింప్స్ భారీ అంచనాలు పెంచేసింది. దీంతో రామాయణ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని అంచనా.
One of the best Title Card in Indian Cinema 📽️
It remember me GOT ⭐#Ramayana #RamayanaGlimpsepic.twitter.com/UZjLeCPQso— Filmy Kannada (@Filmy_Kannada_) July 4, 2025