Dil Raju: సినిమాల పైరసీ.. నటీనటులపై దిల్ రాజు హాట్ కామెంట్స్

ఇటీవల సినిమాలు థియేటర్లలో విడుదలైన రోజే పైరసీ(Piracy) బారిన పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో మేకర్స్(Makers) భారీగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Producer Dil Raju) పైరసీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏదైనా మూవీ పైరసీకి గురయితే ప్రొడ్యూసర్లు మాత్రమే నష్టపోతున్నారు. నటీనటులు, ఇతర ఆర్టిస్ట్‌(Actors and other artists)లు సేఫ్‌గా ఉంటున్నారని సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు.. వారు ఒక సినిమా కాకపోతే మరొక సినిమాతో బిజీగా మారిపోతున్నారు. వేరే ప్రొడ్యూసర్(Producer) నష్టపోతే మాకేంటి అని అనుకుంటున్నారు. ఏదైనా తమవరకు వస్తే కానీ నొప్పి తెలీదు. త్వరలోనే ఈ విషయంపై మీటింగ్ పెట్టుకుంటామని చెప్పారు.

పైరసీపై త్వరలోనే ప్రభుత్వానికి లేఖ

కాగా ప్రస్తుతం దిల్ రాజు ‘నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌‌‌(Producer, distributor)గా’ మాత్రమే కాకుండా తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ (Telangana Film Development Corporation) ఛైర్మన్‎గా ఆయన ఇటేవల ఎన్నికయ్యారు. దాంతో FDC ఛైర్మన్‌గా పైరసీపై కట్టుదిట్టమైన చర్యలు ఎలా తీసుకోవాలో ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అందుకోసమే ప్రభుత్వాని(Govt)కి ఒక త్వరలో లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన కామెంట్స్ పై తెలుగు సినీ హీరోల నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో చూడాలి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *