టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin) హీరోగా శ్రీలీల (Sreeleela) ఫీ మేల్ లీడ్ లో నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. మార్చి 28వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్లలో జోరు పెంచారు. అయితే ఏపీ ప్రభుత్వం ఈ చిత్ర టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. దీనిపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది.
అవన్నీ నిరాధారమైనవి
సెలెక్ట్ చేసిన థియేటర్స్‌లో మాత్రమే టికెట్ ధరల పెంపు వర్తిస్తుందని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ (Mythri Movie Makers) వెల్లడించింది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లో రూ.75 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపింది. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి వారం రోజుల వరకు పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయని తెలిపిందని పేర్కొంది. ‘రాబిన్‌హుడ్ (Robinhood)’ చిత్రానికి టికెట్ ధరలను పెంచారని వస్తున్న ధ్రువీకరించని నివేదికలు, వార్తలన్నీ నిరాధారమైనవని స్పష్టం చేసింది.
#Robinhood pic.twitter.com/WFSxUYemrO
— Box Office (@Box_Office_BO) March 25, 2025
వినోదం అందించడమే మా అజెండా
అందుబాటు ధరల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే తమ సినిమా ముఖ్య ఉద్దేశమని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తెలిపారు. పెంచిన ధరలు ఏపీలో ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే అమల్లోకి వస్తాయని చెప్పారు. సమీప థియేటర్స్‌లో ‘రాబిన్‌హుడ్’ను చూసి ఆస్వాదించండని ప్రేక్షకులను కోరారు. మార్చి 28వ తేదీ నుంచి సినిమా థియేటర్స్‌లో అందుబాటులో రానుందని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.






