యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘తండేల్ (Thandel)’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది.
ఏం కాన్ఫిడెన్స్ బాసూ?
తండేల్ ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య (Naga Chaitanya) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమా రిలీజ్ కు ముందే సక్సెస్ మీట్ ఎక్కడ నిర్వహించాలో ప్లాన్ చేసినట్టు తెలిపారు. శ్రీకాకుళంలో తండేల్ చిత్ర సక్సెస్ మీట్ (Thandel Success Meet) ను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కామెంట్స్ చూస్తుంటే సినిమా హిట్ అవుతుందని చైతన్య చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. మరి ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.
చైతూ కెరీర్ లో బిగ్గెస్ బడ్జెట్ మూవీ
ఇక నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ సినిమాగా తండేల్ తెరకెక్కింది. సుమారు రూ. 75 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ బుకింగ్స్ చూస్తుంటే చైతన్య కెరీర్ లో భారీగా ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం తండేల్ తప్ప వేరే సినిమాలేం లేకపోవడం చైతన్యకు కలిసి వచ్చే అంశమే.
హ్యాట్రిక్ కొట్టేనా?
తండేల్ సినిమాతో సాయి పల్లవి, నాగ చైతన్య కాంబో రెండో సారి వెండితెరపై జత కడుతోంది. ఈ కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక చందూ మొండేటి (Chandu Mondeti), నాగచైతన్య కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన ప్రేమమ్, సవ్యసాచి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక తండేల్ తో ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది.






