Daaku Maharaaj: గూస్‌బంప్స్ పక్కా.. ‘డాకు మహారాజ్’ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా, బాబీ దర్శకత్వంలో(Directed by Bobby) వస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘డాకు మహారాజ్(Daaku Maharaaj)’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్(Poster), మూడు సాంగ్స్, ప్రమోషనల్ వీడియో(Poster, Promotional Video)లు భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌(Trailer launch event)ని నేడు అమెరికాలోని డల్లాస్‌(Dallas in America)లో గ్రాండ్‌గా నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

చిన్న పాప ఎమోషన్‌తో

ఇక డాకు మహారాజ్(Daaku Maharaaj) ట్రైలర్ చూస్తుంటే.. బాలయ్య డబల్ రోల్(Double role) అని, ఒకటి ప్రస్తుతం జరిగే కథ, మరోటి పీరియాడిక్ యాక్షన్(Periodic action) అని తెలుస్తుంది. చిన్న పాప ఎమోషన్‌తో పాటు ప్రజలను కాపాడే హీరో లాంటి కథగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ‘అడవిలో ఎన్ని క్రూర మృగాలు ఉన్నా.. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడు’ అంటూ బాలయ్య గురించి చెప్పిన డైలాగ్ గూస్‌బంప్స్(Goosebumps) తెప్పిస్తోంది. ఇదొక్కటే కాదు ఇలాంటి డైలాగ్స్ ఈ మూవీలో చాలానే ఉన్నాయి. ట్రైలర్ చూసిన నెటిజన్లు బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టడం పక్కా అంటూ ట్వీట్(Tweet) చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు బాలయ్య బాబు డాకు మహారాజ్ ట్రైలర్(Trailer) చూసేయండి..

 

కాగా బాలయ్య ప్రస్తుతం సినీ లైఫ్‌లో, అటు పొలిటికల్‌ లైఫ్‌(Political Life)లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే వరుస హిట్లతో ఊపు మీదున్న బాలయ్య తన లేటెస్ట్ మూవీ(Latest Movie)పై ఫోకస్ చేశారు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల అన్‌స్టాపబుల్ సీజన్ 4(Unstoppable Season 4) షోతో అలరిస్తున్నారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *