నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కుమారుడు మోక్షజ్ఞ తేజ(Mokshagna Teja) కొత్త లుక్ సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ అవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ కుటుంబ వేడుకలో షెర్వాణీలో స్టైలిష్‌గా కనిపించిన మోక్షజ్ఞ, సన్నగా, ఆకర్షణీయంగా మారిన తన రూపంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతో నందమూరి వారసుడు సూపర్‌గా ఉన్నాడంటూ అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు. గతంలో మోక్షజ్ఞ శరీర ఆకృతిపై విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, తాజా లుక్స్‌లో అతని ఫిట్‌నెస్, ట్రెండీ బియర్డ్(Trendy Beard), ఆకర్షణీయమైన శైలి అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ మార్పు అతను తన సినీ ఎంట్రీ కోసం సన్నద్ధమవుతున్నాడని మరోసారి చర్చ మొదలైంది.
సింబాలా వస్తున్నాడు అంటూ కామెంట్స్
కాగా గతంలో ప్రశాంత్ వర్మ(Prahsanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రస్తుతం ‘ఆదిత్య 999’ అనే చిత్రంతో అతను టాలీవుడ్(Tollywood)లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మోక్షజ్ఞ లుక్‌ను చూసిన అభిమానులు “బాలయ్య స్టైల్‌లో బాక్సాఫీస్(Box Office)ను షేక్ చేయడానికి సింబాలా వస్తున్నాడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ 6న అతని పుట్టినరోజు సందర్భంగా సినిమా బృందం నుంచి పెద్ద అప్‌డేట్ రానుందని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తుండగా, ప్రాచీన పౌరాణిక కథ ఆధారంగా రూపొందనుంది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.






