
ఏపీ(Andhra Pradesh) వ్యాప్తంగా నేటి (ఫిబ్రవరి 1) నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు(New registration charges) అమల్లోకి రానున్నాయి. అలాగే భూముల మార్కెట్ ధరలు(Market prices of) కూడా పెంచుతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో గత మూడు, నాలుగు రోజులుగా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లు(Offices of the Sub-Registrar) కిటకిటలాడాయి. కొత్త ఛార్జీలు తప్పించుకునేందుకు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 14250 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రోజుకు 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో దాదాపు 170 వరకు జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. NTR జిల్లాలో 946, పల్నాడులో 944, విశాఖలో 658 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. నిన్న ఒక్క రోజే రిజిస్ట్రేషన్ల ద్వారా సర్కార్‌కు ఏకంగా రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది.
ఆ 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగవు
గ్రోత్ కారిడార్ల(Growth corridors)లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఛార్జీల పెంపు సాధారణంగా 15 నుంచి 20% మధ్య ఉంటుంది. రెవెన్యూ ఆదాయం(Revenue Income) పెంపు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను క్రమబద్ధీకరిస్తున్నారు. కొన్ని చోట్ల ధరలు తగ్గితే.. మరికొన్ని చోట్ల పెరగనున్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు శాస్త్రీయ పద్ధతిలో చేయలేదని, దీని కారణంగా చాలా చోట్ల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే రాజధాని అమరావతి(Amaravati) పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.