
రీసెంట్ గా బాలీవుడ్ నటి కాజోల్ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ కావడం చూసే ఉన్నాం. రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు ఉన్నాయని, తాను ఓ సందర్భంలో ఎంతగానో భయానికి లోనయ్యానని కాజోల్ చెప్పడంతో ఈ కామెంట్స్ పెద్ద దుమారమే లేపాయి. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశమని కూడా చెప్పిన ఈ హీరోయిన్, షూటింగ్ సమయంలో కొన్నిసార్లు నెగిటివ్ వైబ్స్ వచ్చాయని అనేసింది.
దీంతో ఎంతోమంది కాజోల్ చేసిన ఈ దెయ్యం కామెంట్లను తప్పుబట్టారు. ఈ రోజుల్లో కూడా దెయ్యలేంటి అని కొందరు అనగా, ఇంకొందరు కాజోల్ పై ట్రోల్స్ కి దిగారు. ఈ పరిస్థితుల నడుమ ఇదే ఇష్యూపై మరోసారి రియాక్ట్ అయింది కాజోల్. రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు అంటూ తాను చేసిన ఆ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్.. తాను చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం వల్ల మళ్ళీ స్పందించాల్సి వస్తోందని చెబుతూ క్లారిటీ ఇచ్చింది. తాను రామోజీ ఫిలిం సిటీలో ఎన్నో సినిమాల షూటింగుల్లో పాల్గొన్నానని, చాలారోజుల పాటు అక్కడే స్టే చేసిన సందర్భాలు బోలెడున్నాయని చెప్పింది. అదొక మంచి పర్యాటక ప్రదేశం అని చెప్పింది, అక్కడ చాలా ప్రొఫెషనల్ వాతావరణం కనిపిస్తుందని కాజోల్ పేర్కొంది కాజోల్. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడం కారంగానే ఆమె ఇలా యూటర్న్ తీసుకుందని కొందరు మళ్ళీ ఆమెను ట్రోల్ చేస్తుండటం గమనార్హం.