ManaEnadu : టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ (Narne Nithiin) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు పాల్గొని కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఇక ఈ వేడుకలో తారక్ ఫ్యామిలీ (Tarak Family) స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
స్పెషల్ అట్రాక్షన్ గా తారక్
ఈ వేడుకలో ఎన్టీఆర్ (NTR), ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్, భార్గవ్‌తోపాటు కల్యాణ్ రామ్, వెంకటేశ్ తదితరులు సందడి చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వేడుకలో తారక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మ్యాడ్, ఆయ్ మూవీలతో సూపర్ హిట్
ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు తనయుడు నార్నే నితిన్ చంద్ర. ఎన్టీఆర్ బావ మరిదిగా (లక్ష్మీ ప్రణతి సోదరుడు) నితిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2023లో విడుదలైన ‘మ్యాడ్ (MAD)’తో ఆయన టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక ఇటీవల ఆయన నటించిన ‘ఆయ్ (Aay)’ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఆయన మరిన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు.
#NarneNithin’s Engagement with #ShivaniTalluri, relative of #VenkateshDaggubati and #Bollineni families. pic.twitter.com/ocKmyvvUkH
— Sandeep Athreya (@AthreyaSpeaks) November 3, 2024






