Mana Enadu : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ఇటీవలే ‘దేవర’తో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ప్రస్తుతం తారక్ చేతిలో దేవర-2తో పాటు బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్-2 (War 2)’ కూడా ఉంది. ఇటీవలే వార్-2 షూటింగ్ లో పాల్గొని ఆయన హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో కూడా ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం కూడా జరిగింది. కానీ అప్పటి నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదు.
ఎన్టీఆర్-నీల్ సినిమా అప్డేట్
ఓవైపు వార్-2 సినిమా షూటింగులో ఎన్టీఆర్ బిజీ ఉండగా.. సలార్-2 (Salaar 2) చిత్ర పనుల్లో ప్రశాంత్ నీల్ నిమగ్నమై ఉన్నాడు. ఓవైపు ప్రభాస్ కోసం సలార్-2 రెడీ చేస్తూనే మరోవైపు తారక్ తో సినిమాపైనా కాన్సంట్రేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎన్టీఆర్-నీల్ (NTR Neel Movie) సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కు జపాన్ లో మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే.
This time, the earth will tremble under his reign! 🔥#NTRNeel will step onto the soil on January 9th, 2026 ❤️🔥
MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial pic.twitter.com/MfS0aS8OlV
— Mythri Movie Makers (@MythriOfficial) August 9, 2024
చైనీస్ ఆడియెన్సే టార్గెట్
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ను చైనా ఆడియెన్స్ కు పరిచయం చేయాలనుకుంటున్నాడట ప్రశాంత్ నీల్(Prashanth Neel) . అందుకోసమే తమ కాంబోలో వచ్చే చిత్రానికి ‘డ్రాగన్ (NTR Neel Dragon Movie)’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. అంతే కాదు ఈ సినిమాలో తారక్ పాత్రకు సంబంధించిన న్యూస్ కూడా ఒకటి నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. సినిమా కథకు బంగ్లాదేశ్ కు, డ్రాగన్ దేశం చైనాతోను కనెక్షన్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
అలాంటి పాత్రలో తారక్
అయితే బంగ్లాదేశ్ లో సమస్యలు ఎదుర్కొనే తెలుగువారిని రక్షించే పాత్రలో తారక్ కనిపించనున్నాడట. ఇండియా నుంచి బంగ్లాదేశ్ వెళ్లి అక్కడ సవాళ్లను ఎదుర్కొంటున్న తెలుగు ప్రజలకు రక్షకుడిగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ను సూపర్ హైలైట్ చేస్తూ ఓ రేంజులో ఎలివేషన్స్ ఇవ్వాలని నీల్ భావిస్తున్నాడట. అయితే చైనాకు, బంగ్లాలో వలసదారులను రక్షించేందుకు లింకు ఏంటో మాత్రం తెలియడం లేదు. ఏదైమైనా.. ‘డ్రాగన్ (NTR Dragon Movie)’ అనేది చైనా సంస్కృతిలో ఓ భాగం. అందుకే చైనీస్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసేందుకు డ్రాగన్ అనే టైటిల్ ను పెట్టినా.. ప్రశాంత్ నీల్ దానికి జస్టిఫికేషన్ ఎలా ఇస్తారో చూడాలని నెటిజన్లు అంటున్నారు.






