మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి ఇప్పటికే మల్టీస్టారర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ స్టార్స్ కలిసి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్ (RRR)’ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కింది. ఇక ఈ చిత్రంలో ఈ ఇద్దరి పర్ఫామెన్స్ కు ఇండియన్ ఆడియెన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇన్న సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రాజమౌళి టేకింగ్ కు హాలీవుడ్ డైరెక్టర్లు కూడా మెస్మరైజ్ అయ్యారు.
తారక్, చెర్రీ మరో మల్టీస్టారర్
అయితే ఈ ఇద్దరూ కలిసి మరో మల్టీస్టారర్లో నటిస్తే ఎలా ఉంటుంది. ఆ ఊహే అదిరిపోయింది కదా. కానీ ఇది నిజం కాబోతున్నట్లు తెలిసింది. తారక్, చెర్రీ కాంబోలో మరో మల్టీస్టారర్ (Ram Charan NTR Multi Starrer) రాబోతోందనే చర్చ ఇప్పుడు నెట్టింట జోరుగా సాగుతోంది. అయితే అది ఆర్ఆర్ఆర్ చిత్రానికి సీక్వెల్ గా వస్తుందా లేక వేరే దర్శకుడితో ఈ మల్టీస్టారర్ ఉంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం జక్కన్న మహేశ్ బాబు (Mahesh Babu)తో కలసి SSMB29 చేస్తున్నాడు. ఈ సినిమా రావడానికి ఇంకో రెండు మూడేళ్లు ఈజీగా పడుతుంది.
ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉందా?
ఆ తర్వాత జక్కన్న తారక్, చెర్రీలతో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ తీస్తాడో లేదో చెప్పలేం. మరోవైపు ఎన్టీఆర్ కూడా వరుసగా మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. ప్రస్తుతం వార్-2 (War -2) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ప్లాన్ చేసిన తారక్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ కోసం పని చేయబోతున్నాడు. ఇక కొరటాల శివతో కలిసి దేవర పార్ట్-2 కూడా చేయాల్సి ఉంది. ఇవే కాకుండా కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో కూడా ఓ ప్రాజెక్టు చేసేందుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
తారక్, చెర్రీ బిజీబిజీ
మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో కలిసి ఓ సినిమాకు పని చేస్తున్నాడు. RC16 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ సుకుమార్ (Sukumar)తో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే చెర్రీ మరో ప్రాజెక్టు ఒప్పుకోనున్నాడు. అయితే జక్కన్న- మహేశ్ సినిమాకు మూడేళ్లు పట్టినా.. అప్పటి వరకు తారక్, చెర్రీల చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది.






