ManaEnadu: మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) -హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఆరేళ్లుగా ప్రేమించుకొని గత సంవత్సరం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా సీక్రెట్‌గా ప్రేమని దాచి సడెన్‌గా నిశ్చితార్థం(Engagement) అంటూ అందరినీ ఆశ్చర్యపరిచిందీ జంట. వీరు గత ఏడాది నవంబర్ 1న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్(Destination wedding) చాలా గ్రాండ్‌గా చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ.. పలువురు సన్నిహితుల మధ్య వరుణ్-లావణ్య పెళ్లి ఘనంగా జరిగింది. అయితే పెళ్లి అయి ఏడాది కావడంతో ఓ స్పెషల్ ఫొటోతో తన సతీమణికి వరుణ్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు వారి వెడ్డింగ్ వీడియో(Wedding video)ను ‘ది హౌస్ ఆన్ ది క్లౌడ్స్’ సంస్థ రిలీజ్ చేసింది. అందులో చిరంజీవి, పవన్, అల్లు అర్జున్ తదితరులు కనిపించారు.
మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట
ఈ వీడియోలో వరుణ్-లావణ్య పెళ్లి, కుటుంబ సభ్యులు డ్యాన్స్‌లు వేయడం, అందరూ ఆప్యాయంగా పలకరించుకోవడం, ఫొటోషూట్స్.. ఇలా అన్ని చూపించారు. మెగా ఫ్యామిలీ(Mega Family) అంతా కనిపించి సందడి చేసింది. దీంతో ఈ వీడియో క్యూట్‌గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వరుణ్-లావణ్య జంటకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు(Happy first wedding anniversary Wishes) తెలుపుతున్నారు.
మంచుకొండల్లో సతీమణికి మ్యారేజ్ డే విషెస్
వరుణ్ లావణ్య అమెరికాలోని ఓ స్పెషల్ ప్లేస్‌కి వెళ్లి ఎంజాయ్ చేశారు. మంచు కొండల్లో ఉదయిస్తున్న సూర్యుడు.. మధ్య తన భార్య లావణ్యని ప్రేమతో హగ్ చేసుకుని.. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు వరుణ్ తేజ్. ఈ రొమాంటిక్ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ‘మిస్టర్’ (Mister) సినిమాతో వరుణ్ తేజ్, లావణ్య మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ‘అంతరిక్షం’ (Antariksham) సినిమా టైంకి ఇద్దరూ ప్రపోజ్ చేసుకోవడం, పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కడం చకచకా జరిగిపోయాయి. కాగా పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. వరుణ్ ఈ ఏడాది ‘ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine)’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్వరలో ‘మట్కా(Matka)’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
On the occasion of their 1st Wedding Anniversary, Varun Tej & Lavanya Tripathi share lovely wedding special video#VarunTej #LavanyaTripathi #VarunLav pic.twitter.com/eVla2mOL9N
— Ramesh Pammy (@rameshpammy) November 1, 2024






