
యెమెన్ సముద్ర తీరం(Yemeni coast)లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మెరుగైన జీవితం కోసం పొరుగు దేశాలకు వెళ్తున్న ఇథియోపియా వలసదారుల(Ethiopian immigrants)తో కూడిన పడవ బోల్తా(The boat capsized) పడింది. ఆదివారం (ఆగస్టు 3) తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో కనీసం 68 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 74 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ (International Organization for Migration) అధికారికంగా వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఇథియోపియాకు చెందిన సుమారు 154 మంది వలసదారులు ఒక పడవలో యెమెన్ మీదుగా గల్ఫ్ దేశాల(Gulf countries)కు బయలుదేరారు. యెమెన్‌లోని దక్షిణ అబ్యాన్ గవర్నరేట్(Southern Abyan Governorate) తీరానికి సమీపంలోకి రాగానే వీరి పడవ అదుపుతప్పి సముద్రంలో మునిగిపోయింది.
తీరానికి కొట్టుకువస్తున్న మృతదేహాలు
ఈ ప్రమాదం నుంచి కేవలం 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక అధికారులు వారిని రక్షించి సహాయక చర్యలు(Assistive measures) చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలు తీరానికి కొట్టుకువస్తుండటంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. హార్న్ ఆఫ్ ఆఫ్రికా(Horn of Africa) ప్రాంతంలోని ఇథియోపియా, ఎరిట్రియా వంటి దేశాల్లో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కరవు, అంతర్యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రజలు ప్రాణాలకు తెగించి సౌదీ అరేబియా వంటి సంపన్న దేశాలకు వలస వెళ్తున్నారు.
వలసదారుల భద్రతపై మరోసారి ఆందోళన
ఈ క్రమంలో వారు యెమెన్‌ను ఒక రవాణా మార్గంగా ఎంచుకుంటున్నారు. పదేళ్లుగా అంతర్యుద్ధం(With the civil war)తో అట్టుడుకుతున్న యెమెన్ మీదుగా ప్రయాణం అత్యంత ప్రమాదకరమని తెలిసినా బతుకు పోరాటంలో వలసదారులు వెనక్కి తగ్గడం లేదు. ఐఓఎం ప్రకారం, ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే, అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాలలో ఒకటి. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 60,000 మంది వలసదారులు ఈ మార్గం ద్వారా యెమెన్‌కు చేరుకున్నారని ఐఓఎం గణాంకాలు చెబుతున్నాయి. ఈ తాజా ఘటనతో వలసదారుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.
Over 68 Ethiopian migrants died, and 74 others are missing after their boat sank off Yemen’s coast.
Follow: https://t.co/7Dg3b41hTx pic.twitter.com/XWBNZEwNA0
— PressTV Extra (@PresstvExtra) August 4, 2025