Pawan Kalyan : పవర్ స్టార్ ఫ్యాన్స్​కు సర్ ప్రైజ్.. ఆ హిట్ మూవీ రీరిలీజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలున్నా.. వాటిలో ‘బద్రి (Badri)’ చిత్రానికి ఉన్న ఫాలోయింగ్ వేరే లెవెల్. నువ్వు నందా అయితే ఏంటి.. నేను బద్రి బద్రీనాథ్ అంటూ పవన్ చెప్పే డైలాగ్ ఇప్పటికీ పాపులరే. ఇక ఇందులో బంగాళా ఖాతంలో నీరంటే నువ్వేలే.. ఓ మిస్సమ్మా.. మిస్సమ్మా.. అమ్మా.. అంటూ సాగే పాటకు ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. రేణూ దేశాయ్ (Renu Desai), అమిషా పటేల్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 20వ తేదీ 2000లో థియేటర్లలో విడుదలైంది.

పవన్ మేనరిజానికి క్రేజ్

ఈ సినిమా అప్పట్లోనే సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో క్లాసిక్ హిట్ గా నిలిచిన ఈ మూవీ కోసం రమణ గోగుల (Ramana Gogula) అందించిన మ్యూజిక్ చాలా పాపులర్ అయింది. ఇందులోని ప్రతి సాంగ్ సూపర్ హిట్. ఇక ఇందులో పవన్ కళ్యాణ్‌ నటన, లుక్, స్టైల్, మేనరిజానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.  రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను పూరీ జగన్నాధ్ (Puri Jagannadh) తెరకెక్కించగా.. విజయలక్ష్మీ మూవీస్ బ్యానర్ మీద సీనియర్ ప్రొడ్యూసర్ టి. త్రివిక్రమ రావు నిర్మించారు.

పవన్ బర్తే డే రోజు బద్రి రీ రిలీజ్

ఇక ప్రస్తుతం అంతా రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న వేళ బద్రి (Badri Re Release) సినిమాను కూడా రీ రిలీజ్ చేయాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే పవర్ స్టార్ మూవీస్ తమ్ముడు, జల్సా (Jalsa), వకీల్‌సాబ్ చిత్రాలు రీ రిలీజ్ అయి ప్రేక్షకులకు మరోసారి వినోదం పంచడమే గాక నిర్మాతలకు కాసులు కురిపించాయి. ఇక ఇప్పుడు బద్రి చిత్రం కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నట్లు వస్తున్న వార్తలతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. ‘బద్రి’ మూవీని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (Pawan Kalyan Birth Day) సెప్టెంబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *