ఈ సంక్రాంతి(Sankranti)కి విడుదల కాబోతున్న రెండు సినిమాలకు షాక్ తగిలింది. పొంగల్ కానుకగా రిలీజ్ అవుతోన్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్(Daaku Maharaj)’ సినిమాలు టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) ఇటీవల అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం ఏపీ హైకోర్టు(AP Highcourt)లో పిల్ దాఖలైంది. సర్కార్ నిర్ణయం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ పిల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని కోరారు. అంతేకాదు ప్రతివాదులుగా ఆ రెండు సినిమాల మూవీ నిర్మాతల(Producers)ను చేర్చారు. మరి దీనిపై న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.
చెర్రీ సినిమాకు ఇలా..
ఇదిలా ఉండగా తెలంగాణ(Telangana)లో సంక్రాంతి సినిమాల టికెట్ల రేట్ల(Ticket Rates) పెంపు విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్(AP)లో మాత్రం సంక్రాంతి సినిమాలకు అనుకూలంగా CM చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొత్త సినిమాల టికెట్ల రేట్లను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు రామ్ చరణ్ నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి మొదటి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్(Single screen) థియేటర్లో రూ.135, మల్టీప్లెక్స్(Multiplex)లో రూ.175ల టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతి ఇచ్చింది. లిమిటెడ్ బెనిఫిట్ షో(Limited Benefit Shows)లకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ల రేట్లను రూ.600 గా నిర్ణయించింది.
బాలయ్య సినిమాకు అలా..
అలాగే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటిస్తోన్న ‘డాకు మహారాజ్’ మూవీకి APలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110, మల్టీప్లెక్స్‌ల్లో రూ.135 లు పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెనిఫిట్ షోలు ఉదయం 4 గంటలకు ఉన్నాయి. వీటికి మాత్రం రూ.500 పెంచుకునేలా అవకాశం ఇచ్చింది. ఈరెండు సినిమాలతో పాటు వెంకటేశ్(Venkatesh) నటిస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ధరలు కూడా పెంచుకునేందుకు AP ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా గేమ్ ఛేంజర్ జనవరి 10, డాకు మహారాజ్ జనవరి 12, సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న థియేటర్లలోకి రానున్నాయి.






