PM Kisan: రైతులకు శుభవార్త: పీఎం కిసాన్ 20వ విడత విడుదలకు డేట్ ఫిక్స్.. మీ ఖాతాలో డబ్బు వచ్చాయో లేదో ఇలా చెక్ చేయండి!

రైతుల(Farmer)కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. 9.7 కోట్ల మంది అర్హులైన రైతులు ఎదురుచూస్తున్న 20వ విడత రుసుము విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఆగస్టు 2, 2025 (శనివారం)న ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసిలో ఈ డబ్బును విడుదల చేయనున్నారు.

ఈ విడత అర్హులైన ప్రతి రైతుకు రూ.2,000 నేరుగా బ్యాంకు ఖాతాలో జమ కానుంది. అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని ధృవీకరించారు. “ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు, PM కిసాన్ 20వ విడత మీ ఖాతాలోకి వస్తోంది” అని పేర్కొన్నారు.

e-KYC తప్పనిసరి

ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే e-KYC తప్పనిసరి. నిధుల విడుదలకు ముందు రైతులు తప్పనిసరిగా e-KYC, భూమి ధృవీకరణ వంటి ముఖ్యమైన ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయని వారికి నిధులు రాకపోవచ్చు..

e-KYC పూర్తిచేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి:

  • PM-KISAN మొబైల్ యాప్ లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా e-KYC చేయవచ్చు.
  • CSCలు / రాష్ట్ర సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ ఆధారిత e-కీచ్ చేసుకోవచ్చు.
  • ఆధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో OTP ఆధారంగా e-కీచ్ చేయవచ్చు.

e-KYC పూర్తి చేసే విధానం:

స్టెప్‌ 1: pmkisan.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి

స్టెప్‌ 2: ‘రైతు కార్నర్’ సెక్షన్‌లోకి వెళ్లండి

స్టెప్‌ 3: ‘e-KYC’ లేదా ‘మొబైల్ నంబర్ అప్‌డేట్’ క్లిక్ చేయండి

స్టెప్‌ 4: ఆధార్ నెంబర్ నమోదు చేసి, OTPతో ధృవీకరించండి

PM Kisan 20 వ విడతకు ఎవరు అర్హులు?

పీఎం కిసాన్ 20 వ విడత అర్హత పొందాలంటే ఈ క్రింది విదంగా ఉండాలి.

భారత పౌరుడై ఉండాలి

స్వంత సాగుభూమి కలిగి ఉండాలి

చిన్న/సన్నకారు రైతు అయి ఉండాలి

ఆదాయపు పన్ను దాఖలుచేయని వారు

నెలవారీ పెన్షన్ రూ.10,000 కన్నా ఎక్కువ ఉండకూడదు

సంస్థాగత భూస్వామ్యం ఉండకూడదు

PM Kisan ఎలా అప్లై చేయాలి?

1. అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.inకి వెళ్లండి

2. ‘New Farmer Registration’పై క్లిక్ చేయండి

3. ఆధార్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయండి

4. ఫారమ్‌ను సమర్పించి ప్రింట్ తీసుకోండి

5. ఏవైనా సందేహాల కోసం 155261 లేదా 011-24300606 నంబర్లకు కాల్ చేయవచ్చు.

ఈ పథకం ద్వారా రైతులకు వార్షికంగా రూ.6,000 మూడువిడతలుగా అందించబడుతుంది. 20వ విడత నగదు పొందాలంటే వెంటనే e-KYC పూర్తి చేయడం మర్చిపోకండి!

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *