నేడు విశాఖకు ప్రధాని మోదీ.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన డీఈవో

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ (బుధవారం) విశాఖలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆయన తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇక ఈ పర్యటనలో ప్రధాని.. విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్​ డేగాకు ప్రధాని వస్తారు.  ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ స్వాగతం పలుకుతారు.

ప్రధాని మోదీ రోడ్ షో

4:45 గంటలకు సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు ఈ ముగ్గురు డైనమిక్ లీడర్స్.. భారీ రోడ్ షో (PM Modi Road Show) నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 6:45 గంటల వరకు బహిరంగ సభ జరగనుంది. సభా వేదిక పైనుంచి వర్చువల్ విధానంలో వివిధ పథకాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. బహిరంగ సభకు దాదాపు 2 లక్షల మంది వస్తారని.. రోడ్ షోలో లక్ష మంది వరకూ పాల్గొంటారనే అంచనాతో ఏర్పాట్లు చేసింది రాష్ట్ర సర్కార్. దాదాపు 3వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

తెలుగులో ప్రధాని పోస్టు

విశాఖ, ఒడిశా పర్యటనలపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలుగులో పోస్ట్ (PM Modi Telugu Post) చేశారు. “హరిత, పునరుత్పాదక ఇంధనాలు, మౌలిక సదుపాయాల వంటి అనేక ప్రాజెక్టులతో పాటు మరెన్నో ఇతర కీలక ప్రాజెక్టులను ప్రారంభించేందుకు, విశాఖపట్నం ప్రజల మధ్య సమయం గడిపేందుకు నేను ఎదురుచూస్తున్నాను. నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ లో భాగంగా తొలి హబ్‌ అయిన ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపనచేయడం చాలా సంతోషకరమైన విషయం.” అని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *