
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) అప్‌కమింగ్ మూవీస్‌లో ఓజీ(Original Gangstar) ఒకటి. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజిత్(Director Sujith) తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మిస్తుండగా, ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ మొత్తం పూర్తయిందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మరో క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘షూటింగ్ పూర్తయింది. ఇక థియేటర్లలో విడుదల కావడమే తరువాయి. ఓజీ మీ అందరినీ ఆశ్చర్యపరచబోతోంది’ అని క్యాప్షన్ ఇచ్చారు.
That’s a wrap for #OG shooting
All set to go all guns blazing in theatres on SEPTEMBER 25th #TheyCallHimOG #OGonSept25@PawanKalyan @emraanhashmi #Sujeeth @priyankaamohan @MusicThaman @DVVMovies pic.twitter.com/5eriDIqpHh
— Today Box Office (@TodayBoxOffice) July 12, 2025
దసరా కానుకగా థియేటర్లలోకి..
ఇందులో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ(Imran Hashmi) విలన్ పాత్ర పోషించారు.ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యాక్షన్, డ్రామాతో కూడిన థ్రిల్లర్‌గా రూపొందింది. గతంలో విడుదలైన ‘హంగ్రీ చీతా’ గ్లింప్స్(Glimpse) సినిమాపై హైప్‌ను రెట్టింపు చేసింది. ఇందులో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.