భారత్‌ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది.. మన్మోహన్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Mana Enadu : ఆర్థిక సంస్కర్త, అపర మేధావి, మితభాషి,  మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు.  గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను దిల్లీలోని ఎయిమ్స్‌ అత్యవసరం విభాగంలో చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా భరతమాత తన ముద్దుబిడ్డను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయింది

 

విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్ ఒకరని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో ఆయన కీలకపాత్ర పోషించారని తెలిపారు. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయం జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయని కీర్తించారు. ఆయన మృతి దేశానికి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్‌కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

ఆయన నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది

 

“మన్మోహన్‌ సింగ్‌ ఇక లేరన్న విషయం చాలా బాధకు గురి చేసింది. ఆర్థిక సరళీకరణ రూప శిల్పిగా పేరు గడించిన ఆయన .. ఎంతో ధైర్యంతో కఠిన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారు. దేశ అభివృద్ధికి ఎన్నో ద్వారాలు తెరిచారు. ఆర్థిక విధానం పట్ల ఆయనకున్న ప్రగాఢ విశ్వాసం, దేశ పురోగతి పట్ల అచంచల నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భారత దేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది.” అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ తెలిపారు.

ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవి

“భారత దేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్‌ సింగ్‌ను కోల్పోయింది. ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్రవేశారు. పార్లమెంట్‌లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవి. ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారు. మన్మోహన్‌ ప్రధానిగా, నేను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరుచూ మాట్లాడుకునేవాళ్లం. పాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేవాళ్లం. ఆయన జ్ఞానం, వినయం ఎల్లప్పుడూ ప్రస్ఫుటించేవి. ఈ సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి” అని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

“గురువు, మార్గదర్శిని కోల్పోయాను. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్‌ సింగ్‌ దేశాన్ని నడిపించారు. ఆర్థికశాస్త్రంలో ఆయన లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తి. మన్మోహన్‌ సింగ్‌ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్ వేదికగా ఎమోషనల్ అయ్యారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *