Mana Enadu : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ ను కలిసిన దిల్ రాజు.. రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా రావాలని కోరారు. ఈ ఈవెంట్ ను ఏపీలో నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు అంతకుముందు దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ చరిత్ర సృష్టించాలని ఫ్యాన్స్‌ని కోరారు.
జనవరి 1వ తేదీన గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తామని దిల్ రాజు (Dil Raju) ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఆయన చెప్పిన తేదీన ఈ ఈవెంట్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ వేడుకను విజయవంతం చేయాలని రామ్ చరణ్ అభిమానులను కోరారు. గేమ్ ఛేంజర్ మూవీని చూసిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. ‘సంక్రాంతికి మనం మామూలు హిట్ కొట్టడం లేదని అభిమానులకు చెప్పు’ అని అన్నారని దిల్ రాజు తెలిపారు.
“మీరంతా జనవరి 10న రామ్ చరణ్ (Ram Charan) నట విశ్వరూపం చూస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా, కొంతసేపు పోలీస్ ఆఫీసర్‌గా చెర్రీ మిమ్మల్ని తన నటనతో సర్ ప్రైజ్ చేస్తారు. ఈ మూవీలో ఉన్న ఐదు పాటలు దేనికదే ప్రత్యేకం. రన్‌టైమ్ గురించి శంకర్‌కు ముందే చెప్పాను. అన్ని హంగులు జోడిస్తూ 2 గంటల 45 నిమిషాల్లో ఆయన చక్కగా తీర్చిదిద్దారు” అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.







