Mana Enadu : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వశిష్ఠ దర్శకత్వంలో “విశ్వంభర” సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మరో యంగ్ డైరెక్టర్ ను చిరు లైన్ లో పెట్టారు. దసరా ఫేం శ్రీకాంత్ ఓదెలతో చిరు తన నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నానితో ‘ది పారడైజ్ (The Paradise)’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక చిరుతో ప్రాజెక్టు మొదలవుతుంది.
నో హీరోయిన్ – నో సాంగ్స్
అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదని, పాటలు కూడా ఉండవనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి (Cherukuri Sudhakar) ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. చిరు-ఓదెల (Srikanth Odela) సినిమాలో హీరోయిన్, పాటలు ఉండవన్నది అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ (Anirush) ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటున్నట్లు హింట్ ఇచ్చారు.
PROMISE❤️#FANBOYTHANDAVAM ❤️🔥❤️🔥❤️🔥 https://t.co/PYSKDYpZE5 pic.twitter.com/NVHUDpeRHw
— Srikanth Odela (@odela_srikanth) December 3, 2024
అబ్బే.. అదంతా ఉత్తిదే
మెగా 156 (Chiru156) అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఈ సినిమాలో పాటలు లేవు అనేది అవాస్తవం. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్లను ఇప్పటికే ఫిక్స్ చేశాం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ డెవలప్ మెంట్ స్టేజ్ పనులు జరుగుతున్నాయి” అని నిర్మాత చెరుకూరి సుధాకర్ చిరు-శ్రీకాంత్ ఓదెల మూవీపై నెట్టింట వైరల్ అవుతున్న వార్తలన్నింటికి చెక్ పెట్టారు.
The men behind #ChiruOdelaCinema ✨#FanboyThandavam – #MegastarVaibhavam ❤️🔥
Megastar @KChiruTweets
Natural Star @NameisNani @odela_srikanth @sudhakarcheruk5 @UnanimousProd @SLVCinemasOffl pic.twitter.com/4bEKFwNB4q— SLV Cinemas (@SLVCinemasOffl) December 3, 2024






