Pushpa2 Collections: పుష్ప-2 సంచలనం.. వసూళ్లలో ఇండియాలోనే రికార్డ్

పుష్ప-2 మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్.. నీ అవ్వ తగ్గేదేలే.. అంటూ వచ్చిన అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. స్మార్ట్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే మూవీ రిలీజై 32 రోజులు అవుతోంది. అయినప్పటికీ బన్నీ మూవీ బాక్సాఫీస్(Box Office)ను షేక్ చేస్తోంది. ఈ మూవీలో బన్నీకి జంటగా రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించగా.. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, సునీల్ కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీ కలెక్షన్లపై ఓ ట్వీట్ చేసింది.

ఓవరాల్‌గా అత్యధిక కలెక్షన్లు

పుష్ప2 విడుదలై నెలరోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ మూవీ ఇండియా(India)లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘పుష్ప-2’ నిలిచింది. ఈ సినిమా నిన్నటివరకు థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రూ.1,831 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొంది. బాహుబలి-2(Bahubali-2) లైఫ్ టైమ్ కలెక్షన్లు రూ.1,810 కోట్లను దాటేసి రెండో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా దంగల్(రూ.2వేల కోట్లకుపైగా) తొలి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా రూ.5.5 కోట్లు వసూలు చేసింది. తెలుగు వెర్షన్‌లో రూ.1 కోటి, హిందీ వెర్షన్‌లో రూ. 4.35 కోట్లు, తమిళం, కన్నడ వెర్షన్లలో కలిపి రూ.15 లక్షలు కొల్లగొట్టింది.

కలిసొచ్చిన పుష్ప-1 క్రేజ్‌

పుష్ప-1(Pushpa) క్రేజ్‌కి తోడు అల్లు అర్జున్‌పై వచ్చిన గ్లింప్స్, పాటలు(Songs), టీజర్, ట్రైలర్‌(Trailer)లు పుష్ప-2కి ఎక్కడా లేని హైప్‌ను తీసుకొచ్చాయి. చిత్ర యూనిట్ కూడా చివరిలో ప్రమోషన్(Promotions) కార్యక్రమాలు దంచికొట్టడంతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం బయ్యర్లు ఎగబడ్డారు. ఇవన్నీ కలిసొచ్చి గతంలో ఏ సినిమాకు లేనివిధంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్(Pre-release business) చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లు రాబట్టి టాలీవుడ్‌ పేరిట మరో రికార్డు నెలకొల్పింది.

 

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *