IPL 2025లో భాగంగా ఇవాళ నామమాత్రపు మ్యాచ్ జరగుతోంది. ఢిల్లీ(Delhi)లోని అరుజైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్(CSK vs RR) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ జట్టులో పలు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) తెలిపాడు. అటు చెన్నై గత మ్యాచులో ఆడిన జట్టుతోనే ఆడుతోంది. ఇరు జట్లు ప్లేఆఫ్స్‌కి దూరమైన నేపథ్యంలో కనీసం ఈ మ్యాచులో నెగ్గి పాయింట్ల పట్టికలో కాస్త మెరుగైన స్థానంలోనైనా నిలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ప్రస్తుతం చెన్నై 10, రాజస్థాన్ 9వ స్థానంలో ఉన్నాయి.
Match 62@ChennaiIPL vs @rajasthanroyals
🚨 Toss 🚨 @rajasthanroyals won the toss and elected to field against @ChennaiIPL #CSK 👉 Unchanged!#RR 👉 Yudhvir Charak replaces Farooqi#TATAIPL | #CSKvRR #RRvCSK | #IPL2025
— A2ZCRICKET (@a2zcric) May 20, 2025
తుది జట్లు ఇవే..
చెన్నై సూపర్ కింగ్స్: ఆయుష్ మ్హత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ఎంఎస్ ధోని(Wk/C), అన్షుల్ కాంబోజ్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్(Wk/C), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, యుధ్వీర్ సింగ్ చరక్, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ మధ్వల్
PLAYING XIs ANNOUNCED FOR CSK vs RR! 🏏
Both teams have revealed their line-ups for Match 62 at Arun Jaitley Stadium!
Strong squads, big names — let the battle begin! ⚔️
.
.
.#CSKvsRR #RRvsCSK #CSK #RR #IPL2025 #PlayingXI #CFLL #CricketFastLiveLine #IndianPremierLeague pic.twitter.com/ur5qHnonfr— Cricket Fast Live Line (@cfll_live) May 20, 2025






