Mana Enadu : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఈ మూవీ అనంతరం ఉప్పెన ఫేం బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో చిత్రం చేస్తున్నాడు. ఇక గేమ్ ఛేంజర్ కోసం చెర్రీ ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా చరణ్ అభిమానులకు మూవీ మేకర్స్ తీపి కబురు చెప్పారు.
నవంబర్ 8న టీజర్
నవంబర్ 9వ తేదీన ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ అప్డేట్ తో పాటు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో లుంగీ, బనియన్ ధరించి రైల్వే ట్రాక్ మధ్యలో కూర్చుని చెర్రీ కనిపిస్తున్నాడు. ఈ లుక్ లో చెర్రీ .. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘ముఠామేస్త్రీ’ లుక్ వైబ్ కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఇక ఈ పోస్టర్ పోస్టు చేసిన మేకర్స్ ‘హ్యాపీ దీపావళి. నవంబర్ 9న గేమ్ ఛేంజర్ టీజర్ సెలబ్రేట్ చేసుకుందాం’ అని క్యాప్షన్ ఇచ్చారు.
వచ్చే ఏడాది విడుదల
ఇక గేమ్ ఛేంజర్ సినిమా సంగతికి వస్తే ఈ మూవీలో చరణ్ కు జోడీగా బీ టౌన్ బ్యూటీ కియారా అడ్వాణీ (Kiara Advani) నటిస్తోంది. ఇప్పటికే కియారా-రామ్ చరణ్ కలిసి వినయ విధేయ రామ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శంకర్ (Director Shankar) సినిమా కోసం ఈ జంట మరోసారి జత కడుతోంది. ఇక గేమ్ ఛేంజర్ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 జనవరి 10వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.
Happy Diwali Folks 😎💥
Celebrate #GameChangerTeaser from Nov 9th 🧨🔥#GameChanger In cinemas near you from 10.01.2025! pic.twitter.com/Y5pbNNftdu
— Game Changer (@GameChangerOffl) October 31, 2024






