గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’. జనవరి 10వ తేదీన థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ అప్పన్న పాత్రలో నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నెట్టింట ఎక్కడ చూసినా అప్పన్న పాత్ర గురించే చర్చంతా. ఇక ఈ సినిమా తొలిరోజునే బాక్సాఫీసును షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా రూ. 186 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.
ఐదో స్థానంలో గేమ్ ఛేంజర్
ఇలా ఇప్పటి వరకు భారతీయ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు అత్యధిక వసూళ్లు (Game Changer Collections) రాబట్టిన సినిమాల జాబితాలో గేమ్ ఛేంజర్ ఐదో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు పుష్ప-2 (రూ.294కోట్లు) మొదటి స్థానంలో, ఆర్ఆర్ఆర్ (రూ.223కోట్లు) రెండో స్థానంలో, మూడో స్థానంలో బాహుబలి-2 (రూ.215కోట్లు), కల్కి (రూ.191 కోట్లు) నాలుగోస్థానం, ఐదో స్థానంలో రూ.178 కోట్లతో సలార్ సినిమా నిలవగా.. తాజాగా రూ.186 కోట్లతో రికార్డు బ్రేక్ చేసి ఐదో స్థానాన్ని దక్కించుకుంది గేమ్ ఛేంజర్.
The king’s arrival is setting the box office ablaze 🤙🏼#GameChanger takes a blockbuster opening at the BOX OFFICE 💥💥#BlockbusterGameChanger GROSSES 186 CRORES WORLDWIDE on Day 1 ❤🔥
Book your tickets now!
🔗 https://t.co/mj1jhGZaZ6#BlockBusterGameChanger In Cinemas Now… pic.twitter.com/pzU5vm6reD— Game Changer (@GameChangerOffl) January 11, 2025
బాక్సాఫీస్ వద్ద ఊచకోత
ఇక సంక్రాంతి పండుగ రేసులో గేమ్ ఛేంజర్ (Game Changer First Day Collections) దూసుకెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. జనవరి 12న బాలకృష్ణ ‘డాకు మహారాజ్ (Daaku Maharaaj)’, 14వ తేదీన వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ చిత్రాలు గేమ్ ఛేంజర్ వసూళ్లకు బ్రేక్ వేస్తాయా.. లేక చెర్రీ స్పీడుకు అవి బాక్సాఫీస్ వద్ద చతికిలపడతాయా అన్నది చూడాల్సి ఉంది. అయితే ఇప్పట్లో గేమ్ ఛేంజర్ వసూళ్లకు వచ్చిన ఢోకా ఏం లేదని.. మరో వారం పదిరోజులు ఇది బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.






