గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ (Kiara Advani) జంటగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. తమిళ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. విడుదలైన మొదటి రోజు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. 24 గంటల్లోనే హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ అవ్వడంతో కలెక్షన్లకు బ్రేక్ పడింది.
ఓటీటీలోకి చెర్రీ సినిమా
ఈ సినిమా ఫస్డ్ డే కలెక్షన్లు రికార్డు క్రియేట్ చేసినా.. ఆ తర్వాత మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇక ఇందులో అప్పన్న పాత్రలో చెర్రీ నటనకు మాత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకులు ఫిదా అయ్యారు. అంజలి పాత్ర వచ్చిన ప్రతిసారి థియేటర్లో విజిల్స్ పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ (Game Chnager OTT Release)లో సందడి చేసేందుకు వచ్చేసింది.
ప్రైమ్ లో గేమ్ ఛేంజర్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా ‘గేమ్ ఛేంజర్’ చిత్రం శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోందని చిత్రబృందం వెల్లడించింది.ఈ సినిమాలో ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ ను హాయిగా ఈ సినిమాను చూస్తూ మీ కుటుంబంతో జాలీగా ఎంజాయ్ చేయండి.






