గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ భారీ బడ్జెట్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. చెర్రీ నటనకు మంచి మార్కులు పడ్డా.. సినిమాకు మాత్రం మిశ్రమ స్పందన లభించింది. కియారా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్ గా అంజలి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
తాజాగా ‘గేమ్ ఛేంజర్ (Game Chnager)’ ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా ఈ సంస్థే ప్రకటించింది. గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. ఇక రిలీజ్ అయిన 28 రోజుల్లోనే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.






