
దేశ భవిష్యత్తు యువత(Youth) చేతుల్లోనే ఉంది. అలాంటి యువతను డ్రగ్స్(Drugs), గంజాయి పట్టిపీడిస్తున్నాయి. చదువుల్లో రాణించాల్సిన వారు, కన్నవాళ్లను బాగా చూసుకోవాలనే ఆశలతో కళాశాలలో అడుగుపెట్టే విద్యార్థులు(Students) తెలిసోతెలియకో మాదకద్రవ్యాల మత్తు(Drug intoxication)లో పడి జీవితం చిత్తు చేసుకుంటున్నాడు. ఇందుకోసం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని(International Anti-Drug Day) ఏటా జూన్ 26న నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి(UN) నిర్ణయించింది. ఈ రోజు వ్యక్తులు, కుటుంబాలు, సమాజంపై మాదకద్రవ్యాల హానికర ప్రభావాలను తగ్గించడానికి నివారణ, చికిత్స, చట్ట అమలును బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన..
యాంటీ డ్రగ్స్ డే(Anti-Drug Day) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం(Telanagana Govt) ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(Anti-Narcotics Bureau) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఒక ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమంలో చెర్రీ ఎలాంటి లుక్‌తో కనిపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ పోలీసులు వారం పాటు డ్రగ్స్ నివారణపై వారంపాటు అవగాహన కల్పించనున్నారు.
Global Star #RamCharan will attend the International Day Against Drug Abuse and Illicit Trafficking event as the Special Guest tomorrow, 26th June at 4 PM, at Shilpakala Vedika, Hyderabad!
A powerful initiative by the Government of Telangana to raise awareness and drive change.… pic.twitter.com/WkpERpmUjd
— Narendra News (@Narendra4News) June 25, 2025