
‘అందాల రాక్షసి’ నినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran). చిన్న సినిమాగా విడుదలై ఈ మూవీ క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఇటీవల రీరిలీజ్ అయిన మూవీకి సినీ ప్రేక్షకులు, లవర్స్ తో థియేటర్లు నిండిపోయాయి. పలు సినిమాల్లో నటించిన రాహుల్ డైరెక్షన్ లోనూ సత్తా చాటారు. సుశాంత్, రుహానీ శర్మతో కలిసి ‘చి.ల.సౌ’ రూపొందించి మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత నాగార్జునతో తీసిన ‘మన్మథుడు 2’ నిరాశ పరిచింది. దీంతో ఈసారి ఎలాగైన మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna) లీడ్ రోల్ లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘నదివే’ సాంగ్ అలరించింది.
ఆమెను ఆహ్వానించకపోతే నేను రెడీ..
తాజాగా రెండో సాంగ్ ను రికార్డ్ చేశారు. రాహుల్ రవీంద్రన్ భార్య, ప్రముఖ సింగర్ చిన్మయి (Chinmayi) పాడారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ X లో ఓ చిలిపి పోస్ట్ పెట్టగా.. రష్మిక సైతం అదే తరహాలో రిప్లై ఇచ్చింది. ఈ పాట రికార్డింగ్ కు సంబంధించిన ఓ వీడియోను రాహుల్ పోస్ట్ చేసి ‘ఈ సింగర్ సెకండ్ సింగిల్ ను అద్భుతంగా పాడారు. ఆవిడంటే నాకెంతో క్రష్. రాత్రికి డిన్నర్ కు వస్తుందేమో అడగాలి’ అని పెట్టాడు. దానికి రష్మిక (Rashmika) రిప్లై ఇచ్చింది. ‘రాహులా.. నువ్వు ఆమెను డిన్నర్ కు ఆహ్వానించకపోతే నేను రెడీ’ అంటూ కామెంట్ చేసింది. దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) హీరోగా నటిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab) మ్యూజిక్ అందిస్తున్నాడు.
Rahulaaaaa if you don’t ask her for dinner I will 😎@23_rahulr https://t.co/MgpA8izElg
— Rashmika Mandanna (@iamRashmika) August 4, 2025