Rashmika: యోధురాలిగా రష్మిక.. పోస్టర్‌తో సర్‌ప్రైజ్​ చేసిన బ్యూటీ

కుబేర సక్సెస్​ను ఎంజాయ్​ చేస్తున్న రష్మిక (Rashmika Mandanna) ప్రేక్షకులకు భారీ సర్​ప్రైజ్​ ఇచ్చింది. తన కొత్త మూవీకి సంబంధించిన ప్రకటన చేసింది. అడవీ ప్రాంతంలో శత్రువులు తన కోసం వెతుకుతుండగా వారిని ఎదుర్కొనేందుకు ఆయుధం చేతబూని ధైర్యంగా నిలుచున్న యోధురాలి ఫొటోను (Rashmika New Movie Poster) ఎక్స్​ వేదికగా షేర్​ చేసింది. తన అప్​కమింగ్​ ఇదేనని, మూవీ టైటిల్​ కనుక్కోవాలని ప్రేక్షకులకు కోరింది. టైటిల్​ ఎవరూ గెస్​ చేయలేరని, ఒకవేళ కనిపిడితే వారిని తాను స్వయంగా కలుస్తానని హామీ ఇచ్చింది. దీంతో టైటిల్​ ఏమైఉంటుందాని అని కనుక్కునే పనిలో పడ్డారు నెటిజన్లు.

పురాణా గాథకు సంబంధించిన ఇతివృత్తంతో..

ప్రస్తుతం రష్మిక రాహుల్​ రవీంద్రన్​ (Rahul Ravindran) దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) అనే సినిమా చేస్తోంది. షూటింగ్​ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే రష్మిక మరో ప్రాజెక్టును అనౌన్స్​ చేసింది. ఈ మూవీ గురించి ఇంత వరకు ఎక్కడా చర్చల్లోకి రాలేదు. అన్​ఫార్ములా ఫిల్మ్స్​ రూపొందిస్తున్న ఈ మూవీ పురాణా గాథకు సంబంధించిన ఇతివృత్తంతో తీస్తున్నట్లుగా పోస్టర్​ చూస్తే తెలుస్తోంది. హీరో, దర్శకుడు, ఇతర చిత్ర బృందం గురించి తెలియాల్సి ఉంది. రేపు (ఈనెల 27న) టైటిల్​ను రిలీజ్​ చేయనున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *