THE 100: పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ‘మొగలిరేకులు’ సీరియల్ ఫేమ్

పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల(Police Officer Role)లో రాణించిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే ఈ తరహా పాత్రల నుంచి ఆడియన్స్ కోరుకునే బాడీ లాంగ్వేజ్(Body language) డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. తమిళంలో విజయ్ కాంత్ .. మలయాళంలో సురేశ్ గోపి.. తెలుగులో రాజశేఖర్(Rajashekar) ఈ తరహా పాత్రలలో తమదైన మార్క్ చూపించారు. ఇక ఈ జనరేషన్ హీరోలు కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలలో తమ ప్రత్యేకతను చాటుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు అడవి శేష్, రామ్(Ram), శ్రీ విష్ణు, ప్రయత్నించగా.. రీసెంట్ గా నాని(Nani) కూడా ‘హిట్ 3’ సినిమాలో తనలోని కొత్త కోణాన్ని చూపించాడు.

ఆడియన్స్‌కి తప్పకుండా కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్

ఇక ఇప్పుడు హీరో ‘సాగర్(Sagar)’ వంతు వచ్చింది. ‘మొగలిరేకులు’ సీరియల్‌లో పోలీస్ ఆఫీసర్ ‘ఆర్కే నాయుడు’గా సాగర్ మెప్పించాడు. ఈ పాత్రలో తన నటనకుగాను ఆయన ‘మెగా మదర్’ నుంచి మంచి మార్కులు కొట్టేశాడంటే అర్థం చేసుకోవచ్చు. పోలీస్ పాత్రలకు సాగర్ కరెక్టుగా సెట్ అవుతాడని అప్పుడే అంతా అనుకున్నారు. ఇంతకుముందు సాగర్ పోలీస్ ఆఫీసర్‌గా చేసినప్పటికీ, ఆ పాత్రను ఆవిష్కరించిన తీరువేరు. ఆయన తాజా చిత్రమైన ‘ది 100’ సినిమాలో మాత్రం పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ కథలో కొత్త పాయింట్ ఉందనీ, అది ఆడియన్స్‌కి తప్పకుండా కనెక్ట్ అవుతుందని దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్(Director Raghav Omkar Shashidhar) చెబుతున్నాడు. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేటర్లలోకి రానుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *