సంక్రాంతికి వస్తున్నాం.. ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ సాంగ్ రిలీజ్

Mana Enadu : ‘హే గొబ్బియల్లో గొబ్బియల్లో.. పండగొచ్చే గొబ్బియల్లో…. ఎవ్రిబాడీ గొబ్బియల్లో.. సింగ్ దిస్ మెలోడీ గొబ్బియల్లో…. పెద్ద పండగండి గొబ్బియల్లో.. లెట్స్ గెట్ ట్రెండీ గొబ్బియల్లో…. కమ్ ఆన్’ అంటూ పాట పాడుతూ విక్టరీ వెంకటేశ్ ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల్లో జోష్ నింపుతున్నారు. ఆయన గాత్రం అందించిన  బ్లాక్ బస్టర్ పొంగల్ అనే పాట ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా 2025 జనవరి 14వ తేదీన విడుదల కానుంది.

హ్యాట్రిక్ కోసం ట్రై

“ఎఫ్2”, “ఎఫ్3” వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వెంకటేశ్ (Venkatesh) – అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబో హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ సంక్రాంతికి వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన “గోదారి గట్టు” పాట సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ‘బ్లాక్ బస్టర్ పొంగల్ (Block Buster Pongal)’ అంటూ మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. బీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ పాటను వెంకటేశ్ పాడారు.

జనవరి 14న రిలీజ్ 

“హే కోకోరికో కోడి కూడా జనవరి సలిపులి దెబ్బకి.. ఎంతలేసి ఒనికిందో ఏ మూల పండుకుందో.. రథం ముగ్గు వేసుకుంటా ఏడుకూరి నాగలచ్చిమి.. ఎంత దూరమెల్లిందో ఎటు పోయిందో”.. అంటూ సాగిన పాట ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో వెంకటేశ్ సరసన ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి (Meenakshi CHowdary) నటించారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు సమర్పిస్తుండగా శిరీష్ నిర్మిస్తున్నారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *