ఇది వెంకీమామ ర్యాంపేజ్.. 92 థియేటర్లలో 50 డేస్ కంప్లీట్

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో వింటేజ్ వెంకటేశ్(Venkatesh) మాస్ ర్యాంపేజ్ కొనసాగుతుంది. ఈ పొంగల్ కానుకగా జనవరి 14న విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’ మూవీ ఇప్పటికీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్​ సిసిరొలియో సంగీతం అందించగా, శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు(Dil Raju) నిర్మించారు. మార్చి 1న టీవీ, ఓటీటీల్లోకి ఒకేసారి వచ్చేసింది. అయినా ఇప్పటికీ పలు థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా ఈ మూవీ మరో రికార్డు సాధించింది. ఇంతకీ అదేంటంటే..

టీవీ, ఓటీటీలోకి ఒకేరోజు

టీవీలు, ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ వచ్చేసినప్పటికీ థియేటర్లలో మూవీ హవా తగ్గలేదు. నేటితో 92 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తిచేసుకున్న సినిమాగా రికార్డు సాధించింది. ఒక రీజినల్ మూవీ విభాగంలో ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే థియేటర్లలో రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుత రోజుల్లో ఓ సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషమేనని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్

కాగా, విక్టరీ వెంకటేశ్ (Venkatesh)‌ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. రిలీజ్ అయిన తొలి రోజు నుంచి బ్లాక్‌ బస్టర్ టాక్ తో సూపర్ హిట్ టాక్ సాధించింది. విడుదలైన మూడ్రోజుల్లోనే  గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను అధిగమించి అరుదైన ఫీట్ సాధించింది. అలాగే వెంకీ కెరీర్లోనూ కలెక్షన్ల పరంగా ఈ మూవీదే రికార్డు కావడం గమనార్హం. వెంకీ కొడుకు బుల్లిరాజుగా రేవంత్ నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *