
తన ప్రవర్తనతో నిత్యం వార్తల్లో నిలిచే బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకిబ్ అల్ హసన్‌కు (Shakib Al Hasan) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC) షాక్ ఇచ్చింది. అతడి బౌలింగ్ యాక్షన్‌పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిషేధం విధించిన నేపథ్యంలో షకిబ్‌పై ఐసీసీ బ్యాన్ విధించింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. దేశ, విదేశీ బోర్డులకు సంబంధించి లీగుల్లో అతడు బౌలింగ్ చేయకుండా ఐసీసీ నిషేధించినట్లు స్పష్టం చేసింది.
బౌలింగ్ చేయడానికి అనర్హుడు
ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (Bangladesh Cricket Board) ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘మా జాతీయ జట్టు ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ బౌలింగ్‌ను నిషేధిస్తున్నట్లు ఐసీసీ మాకు సమాచారం అందించింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు విచారణ అనంతరం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు విదేశాల్లోని మ్యాచ్‌ల్లో షకిబ్ అల్ హసన్ బౌలింగ్ వేయడానికి అనర్హుడు. అతడి బౌలింగ్ యాక్షన్ కారణంగానే ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో జాతీయ క్రికెట్ ఫెడరేషన్లో బౌలింగ్ చేసేందుకు వీల్లేదు’’ అని స్పష్టం చేసింది.
అందుకే యాక్షన్
షకిబ్ (Shakib) బౌలింగ్ యాక్షన్‌పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులను ఈసీబీ పరీక్షించింది. ఈ పరీక్షల్లో షకిబ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు మోచేయి 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంపు తిరిగినట్లు తేలింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. స్పిన్నర్ బౌలింగ్ వేసేటప్పుడు అతడి మోచేయి 15 డిగ్రీల కంటే ఎక్కువ వంపు తిరగకూడదు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ అతిడిపై నిషేధం వేసింది. దీంతో అతడు బౌలింగ్ చేసేందుకు అనర్హుడయ్యాడు.