BRS @25 Song : పిడికిలెత్తిన కేసీఆర్ గొంతులో ప్రళయగర్జన.. బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీ (BRSAt25) అవతరించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ రజతోత్సవానికి సిద్ధమైంది. ఈనెల 27వ తేదీన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ(BRS Silver Jubilee Meeting)ను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభకు తరలి రానున్నారు.

బీఆర్ఎస్@25 వసంతాలు

బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటికే పలువురు గులాబీ నేతలు పార్టీ గురించి, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR Song) గురించి పలు పాటలు విడుదల చేశారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కేసీఆర్ గురించి జయజయ జననేత.. తెలంగాణ జాతిపిత అంటూ సాగే పాటను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ పాటను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవిష్కరించారు. ఇక తాజాగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరో పాట రూపొందింది.

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

‘చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు… అది తెలంగాణ తలరాతను మార్చిన నవవసంతపు ఋతువు’.. అంటూ సాగిన ఈ పాటను ఇవాళ ఆవిష్కరించారు. “విపక్ష దోపిడీ విలయంలో.. విలవిలలాడిన వేదన.. అస్తిత్వంకై ఆరాటపడిన.. ఆత్మగౌరవ భావన.. పిడికిలెత్తిన కేసీఆర్ గొంతులో ప్రళయగర్జన.. బీఆర్ఎస్.. బీఆర్ఎస్.. బీఆర్ఎస్.. జై తెలంగాణ జైజై తెలంగాణ” అంటూ సాగిన ఈ పాటను సింగర్ సాకేత్ ఆలపించారు. బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *