పాకిస్థాన్ కోసం గూఢచర్యం(indian spy) చేసిందన్న ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Youtuber jyothi malhotra)ను ఎన్ఐఏ (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారులు విచారిస్తున్నారు. హర్యానాకు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతుండగా.. ఆమెకు సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దీన్ని ఆసరగా చేసుకుని ఆమె గుట్టుగా పాక్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు అధికారులు గుర్తించి అరెస్టు చేశారు.
ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు..
జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఏజెంట్లతో సన్నిహిత సంబంధాలు నెరిపిందని ఆమె మీద ప్రధాన ఆరోపణ.ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేసి గూఢచర్యం ఆరోపణలతో ఇటీవల బహిష్కరణకు గురైన ఎహసాన్ ఉర్ రెహీమ్ అలియాస్ డానిష్(Danish)తో జ్యోతికి పరిచయం ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. జ్యోతి పలుమార్లు పాకిస్థాన్(pakistan tour)కు కూడా వెళ్ళి వచ్చిందని, అక్కడి ఐఎస్‌ఐ ఏజెంట్లతో కీలక సమాచారం పంచుకుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆమె తన ఫోన్‌లోని కొన్ని చాట్(chat delete)లను తొలగించినట్లు కూడా గుర్తించారు. ఇది మరింత అనుమానాలకు దారితీసింది.
మరో 11 మంది అరెస్టు
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి కీలక ఘటనల అనంతరం జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైనిక స్థావరాలు, బలగాల కదలికలు, వ్యూహాత్మక ప్రాంతాల వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. ఆమె ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ పరికరాలను సైతం అధికారులు విశ్లేషిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా ఒక్కతే కాకుండా, ఈ గూఢచర్య నెట్‌వర్క్‌లో భాగంగా మరో 11 మందిని కూడా అరెస్టు చేశారు.
ఎవరెవరికి దేశ సమాచారం అందించినదనే కోణంలోనూ..
ఈ క్రమంలోనే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)పై అధికారులు ప్రశ్నల వర్షం(questions Ask by officers) కురిపిస్తున్నారు. ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు వివిధ కోణాల్లో ఆమె నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్‌ల్లో ఆమె చేసిన పర్యటనలపై అధికారులు ప్రధానంగా దృష్టిసారించారు. ట్రావెలింగ్ పేరుతో ఆయా దేశాలకు వెళ్లి ఎవరెవరిని కలిసింది.. ఎవరెవరికి దేశ సమాచారం అందించినదనే కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.







