Mana Enadu : హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theatre Stampede Case) ఘటనలో రేవతి అనే మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిలో 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. బాలుడి ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
నా కొడుకు నన్ను గుర్తు పట్టలేదు
ఈ నేపథ్యంలో మీడియాతో శ్రీతేజ్ తండ్రి భాస్కర్ (Sritej Father News) మాట్లాడారు. తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు చెప్పారని తెలిపారు. అయితే స్పృహలోకి వచ్చిన తన కుమారుడు తనను గుర్తు పట్టలేదని బాధ పడ్డారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగు పడేందుకు ఓవైపు వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని.. మరోవైపు తమకు అండగా పలువురు నిలిస్తున్నారని చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ సపోర్ట్ ఉంది
ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా తమ అండగా నిలుస్తున్నారని భాస్కర్ తెలిపారు. ఘటన గురించి తెలిసిన మరుసటి రోజు నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి తమకు మద్దతు లభించిందని చెప్పారు. పుష్ప-2 ప్రొడ్యూసర్ (Pushpa 2) రూ.50 లక్షలు ఇచ్చారని, అల్లు అర్జున్ (Allu Arjun) రూ.10 లక్షలు అందించారని వెల్లడించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.25 లక్షలు అందించారని పేర్కొన్నారు.
కేసు వాపస్ తీసుకుంటా
“అల్లు అర్జున్ నుంచి నా కుమారుడికి, నా కుటుంబానికి మద్దతు లభిస్తోంది. అందుకే నేను కేసు (Allu Arjun Case) వాపస్ తీసుకుంటాను. నన్ను ఎవరూ బలవంతం చేయడం లేదు. నా భార్య నన్ను వదిలేసి వెళ్లింది. అక్కడేం జరిగిందో నాకు తెలియదు. పాపను వదిలేసి వచ్చేలోపు జరగాల్సినదంతా జరిగిపోయింది. ఆస్పత్రి వాళ్లు కూడా మాకు అండగా నిలుస్తున్నారు.” అని భాస్కర్ మీడియాతో తెలిపారు.






